Thursday 3 March 2011

మా ఓనర్ తో గొడవ (సరదాగా)

ఈ   రోజు  ఉదయాన్నే  లేవగానే  అనుకున్నాను, కొంచెం ఓనర్ గారి గురించి రాద్దామని ,అలాగేనండి  చెప్పక తప్పట్లేదు .ఏమిటో నేను లండన్ రాక ముందు మా వార్ని ఇల్లు చూడమని చెప్పాను. అలాగే చూస్తాను అన్నారు నువ్వు రావడానికి ఒక నేల టైం పడుతుంది కదా ,త్వరలో చూస్తాను అని చెప్పారు ,చిన్నగా ఇల్లు వెతకడం  మొదలుపెట్టారు .ఎక్కడ చూసినా నాన్ వెజ్  ఫ్యామిలి  తోనే షేర్ దొరుకుత్తున్నాయి .కాకపోతే మనకు ఆ వాసన పడదు ,ఇకమనం వండుకోవడానికి ఏమో వాళ్ళు వోప్పుకోవడం లేదు ,కొన్ని ఇళ్లలో లంచ్ వరకు మీరు చేసుకోండి నైట్ కి డిన్నర్ మాత్రం మేము ప్రేపరే చేస్తాం అంటున్నారు , ఇ లోపల నాకు ఏమో తొందర ఎప్పుడెప్పుడు లండన్ వెళ్దామా అని  మా వారిని ఒకటే గోలా త్వరగా ఇల్లు చూడు అని ఎట్టకేలకు  ఒక ఇల్లు చూసారు ,ఆ ఇల్లు ఓనర్స్ గుజరాతి వాళ్ళు అయిన వెజిటేరియన్ వాళ్ళు ,ఇల్లు చూడడానికి చాల బాగుంటుంది


అంటే దాంట్లో కొన్ని కిసుకులు తప్పవు కదా  ఇల్లు బాగుండగానే సరిపోదు ,నేను లండన్ వచ్చినప్పటి నుంచి అదే ఇంటిలో వుంటున్నాం , ఇల్లు రెంట్ ఎంతో కాదు లే అండి బాగా చవక (అని వాళ్ల దృష్టి లో ) మన ఇండియన్ దానితో పోల్చుకుంటే నలబై రెండు వేలు ,అయిన పరవాలేదు ఇల్లు నిట్ గా వుంది ఒప్పుకోక తప్పలేదు ఇంటిలోకి అడుగు పెట్టడంతోనే ఎక్కడ చూసినా పోస్ట్లర్లు ఏంటి బాబు అనుకుంటే అవి ఎమిటోకాదు మొదట గా అమ్మాయిలకి  కనిపించేది వంటిల్లు ,అందులోకి వెళ్ళగానే రూం అంతా కబ్ బోర్డుల తోనూ  ఒక చిన్న డైనింగ్  టేబుల్ ,ఒక పక్క పౌడర్స్ పోసుకోవడానికి వైట్ బాక్స్ లు ,ఒక పక్క డబుల్ డోర్ ప్రిజ్, దాని పక్కన ,గ్యాస్  అదికూడా నాలుగు.బర్నలు ,మన లాగా సిలిండర్ మాత్రం లేదు ,పైప్ సిస్టం ,తర్వాత కబ్ బోర్డులలో దేనికి దానికిపప్పులు అమరిక ,వీళ్ళకి మన దగ్గర లాగా పెద్ద వాకిళ్ళు వుండవు కదు అందుకని కిటికీ కి దగ్గరగా, ఒక చిన్ని కుండీలో తులసి మొక్క ,ఇంకొక బారు కుండీలో వుల్లి మొక్కలు అవి పూలూ పూసి అందంగా ఎల్లో కలర్ లో వున్నాయి .


చుట్టూ గ్లాస్ విండోలు ,దాని వెనక ,ఇ పూలూ ,ఇక మధ్యలో కడుక్కోవడానికి బేసిన్ అది మాత్రం మన దగ్గర లాగా లీకేజ్ వుండదు,నాలుగు రోజులుకొకసారి ప్లంబర్ ని పిలవక్కర్లేదు ,ఆ పక్కనే డస్ట్ బీన్ దానికొక  పోస్టరు ,అదిఎమిటోకాదు (dont put recycle bin ,paper,etc) ,ఒకసైడ్ బుజ్జి ట్రే వుల్లి పోసుకొవడానికి ,అదండి వంటింటి సంగతి  అప్పుడే అయిపోయింది అనుకోవద్దు ఇంకా బెడ్ రూం బాతురూం,హల్ లేదూ  హమ్మయ్యా అనుకోండి అంతవరకూ మీరు అదృష్టవంతులు ఇంక చదవాల్సినవి రెండే కదా అని......................


బాతురూం గురించి చెప్పాలంటే అసలు ఇల్లు తీసుకున్నదే దాని కోసం నాకు బాతురూం నిట్ గా లేకపోతె అసలు వుండలేను, ఇందులో కుడా కబ్ బోర్డులు ఎవరి సామాను వారు పెట్టుకోవడానికి ,ఇకపోతే బాత్ టబ్బు ,సినిమాలోచుపించేటట్టు ,ఇక మీరు ఉహించుకో౦డి షవరు ,ఒక వైపు వేడి నీళ్ళు ఒక వైపు చన్నీళ్ళు టాప్ తిప్పితే ,ఇదంతా బాగానే వుంది అక్కడ కూడ ఒక పోస్టరు (both room is everything put cleanly, if u dont know how to use u asksomeone) దాని పక్కన వెస్ట్రన్ టాయ్లెట్ అడుగన మొత్తం చెక్కతో ల్యాండ్ అయ్యి వుంటుంది దానితో బెడ్ రూం ఓవర్


 ఇక బెడ్ రూం గురించి కొంచెం చెప్పేస్తా ఇక మిమ్మల్ని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు , మేము వుండే సామ్రాజ్యం మా సార్ గారి రూం ,ఇందులో పెద్ద రెండు చక్క బీరువాలు ,ఒకటి మా వారికి ,ఒకటి నాకు ,ఇకపోతే అన్ని బాగున్నాయి, మా హనుమయ్య (గాడ్) ని ఎక్కడ పెట్టాలి ఓ తెగ పూజలు చేసేదానికిలాగా దేవుడి సామాను దాంతో పాటు కుందులు వగైరా వగైరా అన్ని తెచ్చేసుకున్నాను. ఇక్కడ గోడకు అతిక్కిచ్చి చిన్న పిట్టగోడ దాని మీద సగం దేవుడి సామాను సగం మా సార్ గారి పుస్తకాలూ ,వుంది చిన్నరూం  దాంట్లో మధ్యలో డబల్ కాట్ ,రెండు బిరువాలలో, ఒకదానికి మిర్రర్ ,అంతా బాగానే వుంది ఇక్కడ కుడా ఒక పోస్టరు ( dont do dipaarajana in bedroom) గోడలన్నీ తెల్లగావున్నాయీ పాడు చెయ్యదు గద్గది సంగతి .....


ఇల్లు గురించి చెప్పడం అయింది ,ఇంతకీ గొడవ ఏమిటంటే నేను రోజు లంచ్(ప్రిపేర్) నేను చేస్తాను ,డిన్నర్ తను చేస్తుంది తనకేమో అన్ని ఎక్కడ తీసినవి అక్కడ పెట్టాలి ,మనకి మరిచిపోయే రోగం వంట చేసేటప్పుడు విండో తియ్యమంటుంది అలాగే కొంచెం ఓపెన్ చేసి చేసుకుని మేము డైలీ చపాతీ చేసుకుని ,కర్రీ చేస్తాను ,కాని అంతా బాగానే పెట్టాను పాన్ కడగలేదని గొడవ ,మరి విండో వెయ్యడం మరిచా అంతే. ఇక ఉకదుంపుడే ,ఇక మా సార్ గారు అప్పుడే ఆఫీసు నుంచి రాక తను చెప్పింది అయ్యో నేను చెప్పాను మరిచా అంతే అని ఇప్పుడు సెట్ అయ్యిందిలెండి ఏం చేస్తాం ఒకటి కావాలి అంటే ఒకటి సర్డుకోక తప్పదు మరి .... మొత్తానికి నాకు ఇల్లు బాగా నచ్చేసింది.......


మీకు నచ్చేసిందో లేదు త్వరగా చెప్పేయండి. ఏంటి మన గురించి చిప్ గా ఆనుటు౦ది అనుకోకండి ఎంతైనా దూరపుకొండలు నునుపు కదా సామేత వుండనే వుంది కదు ఇంతకీ మీకు డవుటు రావచ్చు వీళ్ళు ఇండియా వాళ్ళే కదా కాని ఇల్లు గల్ల ఓనర్స్ మాత్రం ఇండియా నుంచి ఇక్కడ సెటిల్ అయ్యారు .అయిన ఇక్కడికి వచ్చాక మన ముందు సంగతి ఏమిటో మరిచిపోతారు జనం మా ఓనరు నేను ఏదైనా తప్పు చేశాను అనుకో అంతే నాకు తెలుసు ఇండియా నుంచి వచ్చిన వాళ్ళకు ఇవి ఎప్పుడు చూసి వుండరు ఎలా వాడుకోవాలో తెలియదు ఇంకొక విషయం తను ఇండియన్  నాకు ఫస్ట్ లో కోపం వచ్చేది ఆ మాటలకి అయిన ఇల్లు బాగుంది గదు ఇవన్ని దాని ముందు ఎంతమీరు  లైట్ తీసుకోండి .

8 comments:

  1. మీ ఇంటి కబుర్లు ఓనర్ గురించి భలే ఓపికగా బాగా రాసారు బావుంది....మీ టపా!!

    ReplyDelete
  2. నాకొకటి అర్ధం కాట్లేదు! మీరు ఆ ఇంట్లో పేయింగ్ గెస్ట్ గా ఉంటున్నారా??? వంటగది ఒకటేనా? మీరు,మీ ఓనర్స్ కలిసి వంట చేసుకుంటారా??కానీ చాలా ఓపిగ్గా రాసారు టపా :)

    ReplyDelete
  3. hi suma me post baundi saradaga

    ReplyDelete
  4. ఇందు గారు

    ఒక రకంగా పేయింగ్ గేస్ట్ లాంటిదే లెండి :). అసలు ఈ టపా చాలావరకు ఇంటి గురించి చెప్పడానికే సరిపోయింది. ఇంకో టపా మా మధ్య జరిగిన సరదా సరదా చిలిపి గొడవల గురించీ రాయాలి. ఆ అమ్మాయికి గుజరాతీ, హిందీ మాత్రమే తెలుసు, నాకు తెలుగు,ఇంగ్లీషే, తమిళం.. ఇక ఊహించుకో మేమిద్దరం మాట్లేడుకునే దృశ్యం :))

    అన్నట్లు నా బ్లాగు డిజైన్ మార్చా.. ఎలాఉంది? త్వరగానే లోడ్ అవుతుందా?

    ReplyDelete
  5. baundi me owner gari godava

    ReplyDelete
  6. మీకు, మీ ఓనర్ గారికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు:)

    ReplyDelete
  7. @జయ గారు
    మీకు కూడ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు....

    ReplyDelete
  8. Hii suma garu....mee blog design baagundi...kani venakaala pink color konchem kottochchinattu kanapadutondi ;) adokkate...bt twaragane load avutondi...petteyandi mee recent chilipi godavalu gurinchi!!!

    ReplyDelete