Wednesday 16 March 2011

టైటిల్ ఒకరిది పేరు ఒకరికి

మన జనం నమ్మకూడని అనేక విషయాల్ని నమ్ముతున్నప్పుడు ,నమ్మాల్సినవి నమ్మడానికి ఎందుకు అంత వ్యతిరేకిస్తారో నాకు అయితే అర్ధం కావడంలేదు.హైదరాబాదులో ఒకరోజు విశ్రాంతి కోసం ఒక పురాతన దియేటర్ కి వెళ్ళాను. పోస్టరు ఫై బయంకర సినిమా అని వుంది.నగరాలలో జీవించడానికి మి౦చిన బయంకరం  ఏమి వుండదు కాబట్టి దైర్యంగా లోనికి వెళ్ళాను.హల్లో  కొంతమ౦ది కాళ్ళు చాచుకుని నిద్ర పోతున్నారు,మరి కొంతమంది పల్లీలు  నములుతూ  దొమ్లని చరుస్తున్నారు.వున్నట్లు వుండి గోడలు అదిరిపోయే శబ్దం వినిపించింది. నలుగురైదుగురు పారిపోవడానికి ప్రయత్నించారు.గేట్ కీపర్ అడ్డుకొని ఫ్యాన్ లు ఆన్  చేసినప్పుడు అదే శబ్దం వస్తుంది .అది మా ప్రత్యేకతని సర్దిచెప్పాడు

.
.
సినిమాప్రారంభమైంది ,చూడడమా,నిద్రపోవడమా అని నిర్ణయం తీసుకునే లోపల కాళ్ళపై ఏదోపాకింది వులిక్కిపడి విదిలించాను.సన్నటి వెలుతురులో ఒక ఎలుక కనిపించింది.దియేటర్లో నల్లులువుంటాయని తెలుసు మా వూరిలో ఇప్పటికి నల్లులని చంపుతూ చంపుతూ తీరిక దొరికినప్పుడు సినిమా చూస్తూవుంటారు. అ ఎలుక నన్నుచూసి బయపడకుండా ముందు కాలితో ముక్కు గిరుకుంటూ వెక్కిరించింది.ఒళ్లు మండి కుర్జీ చేతి ని లాగాను ఊడోచ్చి౦దిఅ ఎలుక నన్ను చూసి కవ్విస్తూ బాల్కనీ మెట్లుక్కి,నేరుగా ప్రొజెక్టర్ రూం లోకి దూరింది.ఆపరేటర్ నిద్రలో వున్నాడు రెండు ఎలుకలు అతని మిసాలపై వ్రేలాడుతున్నాయి,తల తిప్పి చూస్తే కనీసం పది ఎలుకలు కొలువు తీరివున్నాయి.

ఎలుకల్ని కొట్టడం పెద్ద గొప్పఅనుకుంటున్నావా?.ఒక ఎలుక కోప్పడింది మనుషులు ఎలుకల్లా కలుగుల్లో జీవిస్తు న్నప్పుడు,ఎలుకలు మనుషుల్లా మాట్లాడడం వింతగా అనిపించలేదు.డిస్టర్బ్ చెయ్యద్దుమేమంతా కలిసి సినిమా కధ తయారుచేస్తున్నాం. అని ఒక ఎలుక చెప్పింది.ఎలుకలకి సినిమాలకి సంభ౦దేమిటి? .ఒక సీన్ కి ఇంకొక సీన్ కి సంభంధం లేకుండా సినిమాలోస్తున్నపుడు,అనవసరంగా సంభందాల గురించి మాట్లాడకు.

మనుషులు తీసే సిని మాలు ఎలుకలకె నచ్చనప్పుడు ,ఎలుకలు చెప్పే కధలుమనుషులకి నచ్చే అవకాశం వుంది.కదా !ఈ లాజిక్ అర్ధం కాలేదు అన్నాను ,లాజిక్ గురించి ఆలోచిస్తే లైఫ్ లో  మ్యాజిక్ పోతుందని హిత బోధ చేసింది సినిమా కి తమకివున్న రిలేషన్ షిప్ గురించి ఒక ఎలుక ఉపన్యాసం ఎత్తుకుంది.ఈ దియేటర్ లో కాపుర ము౦డడం వల్ల మా  జీన్స్ లో సినిమా ఇంకి పోయింది ,ప్రేక్షకులు ఎప్పుడు నిదరపోతారో,ఎప్పుడు గురక పెడతారో మాకు తెలుసు.కాబట్టి బోర్ కొట్టే సిన్స్ ని మేమే పళ్ళతో కొరికి ఎడిట్ చేసెవాళ్ళం, ఆపరేటర్ ఒకొక్కసారి కొన్ని రీళ్ళని మరిచిపోయి సినిమా చూపించే వాడు .ఇదంతా చూసిన తరువాత సినిమాకి కధ చేయడం పెద్ద గొప్పె౦ కాదనిపిం చింది .ఎవడికో ఒకడికి కధను అమ్మేసి డబ్బుసంపాదించేస్తాం అని చెప్పింది .ఎలుకలకి డబ్బుఎందుకు ? డబ్బు సంపాదించిన తరువతా మమ్మలి ఎలుకలుగా ఎవరు  గుర్తించరు............

ఇంతకీ కధెంటీ? సినిమాలన్నింటికీ మూలకధలు ఒక నాల్గుఐదు వుంటాయి హిరో హిరోయిన్లు ప్రేమించుకుంటారుమధ్యలో విడిపోతారు, చివరిలో కలుసుకుంటారు, అప్పుడప్పుడు ,కుదిరితే ఓ కప్పు కాఫి అంటారు.....కుదరక పొతే ఒక పెగ్గు మందు అంటారు. ఇంకొక కధలో హిరో అంబాజీపేట లో ఆముదం అమ్ముతూ వుంటాడు. అక్కడ కి చమురు కోసం వెళ్ళిన పెద్దాయన హీరోని గుర్తిస్తాడు. ప్లాష్ బ్లాక్,పైటింగ్ ది ఎండ్ ఒక లైన్ లో కధ ఎవరైనా చెబ్తారు మొత్తం చెబితే కదా గొప్ప అన్నాను.
.
అన్నానికి ఒక మెతుకు సినిమా కి ఒక సీన్ చూస్తే చాలుసినిమాను స్క్రీన్ మీద కాకుండా రీళ్ళ మీద చూసిన వాళ్ళం ఇంతలోఆపరేటర్ నిద్రలేచే ప్రయత్నం చేస్తే ఎలుకలన్నీ రీళ్ళ వెనక్కి  దూరిపోయాయి నా చేతిలో కర్ర చూసి ఆపరేటర్ దడుచుకుకొని తీసినవాళ్ళని ,తన్నాలికాని చూపించిన వాణ్ణి తన్నడం ఎమి న్యాయం? అన్నాడు నువ్వు నిద్ర లేచి ప్రేక్షకులని నిద్ర లేపకు . ,  . అని వచ్చేసాను .

వారం తరువాత అదే దియేటర్ కి వెళ్ళాను ప్రొజెక్టర్ రూంకి వెళ్తే ఎలుక దిగాలుగా కూర్చుని వుంది.మిత్రమా కధ ఎంత వరకు వచ్చింది? కాటి వరకువచ్చింది.ఎలుకలు వున్న చోట పిల్లి కూడ వుంటుంది అని తెలుసుకోవడం జ్ఞాన౦.అ పిల్లి మా మిత్రుల్నితినేసి మా కధను కుడా జీర్ణం చేసుకుంది .ఒకే ఒక ఎండు చేపల బుట్టకి కధను అమ్మేసింది.అయిన కధలోతప్ప జీవితంలో నీతి ఎక్కడ వుండి ఏడ్చింది.విసురుగా వెళ్ళిపోయింది. ఎలుక విన్నా వినకపోయినా చెప్పడం నా ధర్మం సినిమా కధను ఎలుక తయారు చెయ్యడం గొప్ప కాదు ,దాన్ని పిల్లి మి౦గేసి టైటిల్ కార్డ్డులో తన పేరు వేసుకోకుండా చూడాలి. అది సంగతి ....  
.
          .

3 comments: