Thursday 17 March 2011

వీకెండ్ కబురులు

లండన్ లో మా ఫ్రెండ్ ఒకటి వుంది,అదిఎమో ప్రతిసారి ఫోన్ చేసి సినిమా కి వెళ్దామా ?అని అడుగుతుంది,నాకు ఏమోఒక్క నిమిషము కుడా తీరిక లేని పనులన్నీ మరి వీకెండ్ లోనే వుంటాయి .సరిలే నేను వస్తాను నువ్వు రెడీ అవ్వు అనిచెప్పాను.ఇక మొదలు పెట్టాను పనులను శుక్రవారం సాయంత్రం నుంచి ,వున్నది చిన్నరూ౦ దా౦ట్లో ఒక పక్కగా హనుమయ్య (గాడ్), దాని పక్కన ఫ్రూట్స్ గ్యాలరీ,మొదట గా హనుమయ్య నితుడవడానికి రెడీ అయ్యాను తుడిచి పక్కనే గణపతి,ఇక అయన ఊరుకోడు గా అ పక్క అమ్మవారి ఫోటోలు ,ఇ  లోపల మా ఫ్రెండ్ దగ్గర నుంచి ఫోన్ ఏంటిరెడీ అవుతున్నావా ఆహా! బలే దానివి ఎందుకు రెడీ అవ్వడంలేదు ఇప్పటికి   మొదటగా హనుమయ్యను ఎత్తుకున్నాను అదే నే దేవుడి రూం దానిలోని మొదట ఫోటో ఇంకా గణపతి,వగైరా వగైరా గాడ్ లు వున్నారు ,ఇప్పుడుఇంకా టైం ఉదయం ౧౦.౦౦ కదరా,అదేంటి మనం ఉదయం ఆట కదా  వెళ్ళేది ? దానికే లేవే అబ్బా నువ్వు మాట్లాడుతూవుంటే టైం అయిపోతుందిరా, సరే మరి వుంటాను.నేను మళ్ళా ఫోన్ చేస్తానులే ,వొకే  బాయ్ రా అంతటితో ముగిసింది మొదటి కాల్,నేను మళ్ళి సర్దడం మొదలెట్టా ,గణపతి దగ్గర నుంచి ,అమ్మవారుల ఫోటోల దగ్గరకు ,తరువాత కృష్ణుడు,అనగా గోపాలుడు ,ఇంకా చాలా చాలానే వున్నాయి,అవి అన్ని చెబుతూ వుంటే నాకు సినిమా కి టైం అవుతుంది బాబు,దానితో మొదటి విడత ముగిసింది.
.

ఫ్రూట్స్ గ్యాలరీలో పండ్లు అన్ని ఎలా అంటే అలా పడేసి వున్నాయి,దాంట్లో మొదటి ర్యాకులోద్రాక్షని, రెండవ ర్యాకు లో ప్లంని మూడో ర్యాకు లోస్ట్రాబెర్రీస్ ని, నాలుగువ ర్యాకులోయాపిల్ ని, ఐదవ ర్యాకులోకమలాలు, అరవ ర్యాకులో చర్రి ఫ్రూట్,యిలోపల ఒక ఆలోచనా ,నేను మొదట ర్యాకులో ద్రాక్ష కాకుండా చర్రిని పెడదాము,అయిన ఎవరైనాఇంతసేపు సర్ద్దుతారెంటి!సుమా తప్ప మరలా ఫోన్ ఫ్రెండ్ దగ్గరనుంచి ఎంటిరా (r u ready)ఇప్పుడే ఫ్రూట్స్ గ్యాలరీ కి వచ్చాను రా,అసలు నిన్ను కాదు మీ ఆయనని అనాలి ఇన్ని వెరైటీ ఫ్రూట్స్ తెచ్చినందుకు,అదొక పనిగా సద్డడం ,మధ్యలో ఎందుకు పాపం మా బంగరిని అంటావు అసలే అమాయకుడు, ఫీల్ అవకు  రా వస్తాను,ఇప్పుడు టైం ఎంతో తెలుసా!౧.౦౦ అయ్యింది రా,పర్లేదులే సిని మ్యాక్స్ కె కదా,వెళ్దాం ,మన ఇంటి కి దగ్గర కదా నోప్రాబ్లం ,నో నో సిని వరల్డ్  కి  అయితేనే  నేను వస్తాను, ,ఏ ఎందుకు కాని అ దియేటర్ లో ఏం పెట్టావేంటి? తరువాత చెప్తానులే నువ్వు రెడీ గా,ఫీల్ అవకు మార్నింగ్ షో మిస్ అయింది అని , మ్యాట్ని కి వెళ్దాంలే, సరే మరి నువ్వు పనిగానివ్వు,త్వరగా  బాయ్ రా అని ఫోన్ పెట్టేసింది ,ఇంక ఇప్పుడు  మాత్రం లేట్ చెయ్యకూడదు త్వరగా రెడీ అవ్వాలి అని సుమ పాపం చిన్నగా ఫ్రూట్స్ గ్యాలరీ సర్దడం అయిపొయింది.
.
 ఇక బట్టలుఅమ్మాయి గారు వారాంతం నించి వున్నవన్నీను  వుతుకుతాను అనుకోకండి వాషింగ్ మిషనేలే ఇప్పుడు ఎవరు వుతుకుతున్నారు లే అసలే ఇది లండన్ ఇది ఎమి మా వూరు కాదు బారెడు స్తలం ఇచ్చి వుతుకమ్మా అనడానికి,బట్టలన్నీ వాషింగ్ మిషన్ లో వేసేసి పనులన్నీ పూర్తి చేసుకుని ,మా వారు ఆఫీసు నుంచి వచ్చేసరికి పనులన్నీ అయిపోయాయి,మా ఫ్రెండ్ కి ఫోన్ చేసాను అప్పటికి టైం 6.00 అయింది,పాపం అది ఒకపక్క మ్యాట్ని మిస్ అయ్యింది అని ఎదవ పేస్ ఒకటి అమ్మచాందిని ఎందుకు ఫీల్ అవుతున్నావు.ఎందుకే ఇంత లేట్ చేసావు.నేను చాల ఫీల్ అవుతున్నాను.నా ప్లాన్ అంతా మిస్ అయ్యింది ,ఎమి అయ్యింది రా అని అడిగాను.
.
అప్పుడు చెప్పింది అసలు విషయం !ఇంతకీ సంగతి ఏమిటి అంటే సిని వరల్డ్ లో సినిమా చూడడం కన్నాముందుగాత్రీవ్రమైన కోరిక ఒకటి వుంది .అమ్మాయిగారికి అది ఎమిటిటంటే పాప్ కాన్ అంటే మహా ఇష్టం అది నేను ఎప్పుడుసినిమా కి వెళ్ళినా ,సినిమా చూడడం  తర్వాత ముందు పాప్  కాన్ అంటుంది,దాని భాధ ఏమిటో అర్ధం కాలేదుగామీకు,దియేటర్ లో ఎక్కడైనా పాప్ కాన్ వుండవేమిటి? అని మీ డవుటు, కాదుగా తక్కువ డబ్బులతో మర్రెన్ని పాప్ కాన్ తినాలి అది ప్లాన్,అబ్బా ఇ ట్విస్ట్ ఏంటో  ? సిని మ్యాక్స్ వద్దు సిని వరల్డ్ కావాలని ఎందుకు అంటుందో అర్ధం అయ్యిందా అదేనండి సినివరల్ద్ లో ఆ రోజు ఆఫర్ వుండి ఏడ్చింది లే మాములు గా అయితే 4$ ఒక ప్యాక్ వచ్చి ఇప్పుడు  2$ అట అదిసంగతి...


మనకు వుండనే వుంది కదా వెనకటి కాలం నుంచి ఒక సామెత తింటే గారెలే తినాలి వింటే భారతం వినాలి అని ఇక్కడ మాత్రం తింటే పాప్ కాన్ తినాలి.చూస్తే సిని వరల్డ్ లోనే సినిమా చూడాలి, అసలు ఎంటోమరి అ దియేటర్ ప్రత్యేకత ఏమో గాని అక్కడికి వెళ్ళితే నాకు అయితే అ ప్యాక్ చూస్తే నే తినాలిఅనిపిస్తుంది.ముందు ప్రతి వీక్ ఎండ్ శనివారం ఉదయం వెళ్తాం దియేటర్ కి చెప్తే నమ్మరు గాని రోజు మొత్తం అక్కడే గడిపెస్తాము,అసలు వెళ్ళేది పాప్ కాన్ తినటానికి ఇంకొక విషయం  అ రోజు బాగా మంచు పడింది ఇక్కడ ఏమో బస్సులు  మధ్యలో ఆపేసారు,కాని బాగా వెయిట్ చేసాము ,బస్సులో,మరి చూడండి ఆ పాప్ కాన్ మహిమ మరి నేను ఇండియా లో వున్నప్పుడు ఒక్క సారికూడా తినలేదు పాప్ కాన్ ,అంతే కదా అక్కడ రెండు రూపాయలకి ఇస్తే అది మనకు నచ్చదు ఇక్కడ మాత్రం అదే ప్యాక్ ని 4$ పెట్టి కొని తింటే అప్పుడు అనందం ఎమి చెస్తా౦ రుచి అలాంటిది,మా ఫ్రెండ్ పుణ్యమా అని నాకు కుడా అలవాటైంద పాప్ కాన్ ,మరి మీరు కుడా కానియండి ఈ  పోస్ట్ ఎవరు ఎక్కువ సార్లు చదివితే  వాళ్ళకి అన్ని బోనస్ పాప్ కాన్ ప్యాక్ లు పోస్ట్ చేస్తానులే కామెంట్ పెట్టేటప్పుడు అడ్రస్ రాయడం మరిచి పోకండి అందరికి టాటాలు