Monday 28 February 2011

ఓ అమయకురాలి కష్టాలు .......

మాది ఒక చిన్న పల్లెటూరు అందులో ఒక చిన్న కుటు౦బం  అమ్మ ,నాన్న,తమ్ముడు ,నేను ,చిన్నప్పటి నుంచినాకు కొంచెం కోపం ఎక్కువ ,ఎది అయిన నాకు ముందు చెయ్యాలి అనే తపన ,బొమ్మలు మా నాన్న రెండు తీసుకోనివస్తే అందులో ఎది బాగుంటే అది నేను వుంచుకొని మిగతాది మా తమ్ముడికి ఇచ్చేదాన్ని ,సరే నాన్న కు అమ్మాయిలు అంటే ఇష్టం ,ఎందుకు ఇష్టం చెప్పనా మా చిన్నానకు ,పెదనాన్న కు ,ఇంకో బాబాయి కి అందరికి అబ్బాయిలు పుట్టారు అందుకని యింట్లోకి మొత్తానికి నేనంటే ఇష్టం ,యిక యివిడగారు చెప్పిందే రాజ్యం ...ఇలా వుండగా పెళ్లి గడియలు రానేవచ్చాయీ ,నేను పిజీ పూర్తి చేసుకొని జాబ్ కోసం ఇంటిలో వాళ్ళు హైదరాబాద్ పంపిచారు .నేను వెళ్ళాను
ఒక సంబందం వచ్చింది అది కుదిరన వెంటనే త్వరగా పెళ్లి చేసుకున్నాను .

అ తర్వాత ఎమి జరిగింద౦టే,నేను కొన్ని రోజులు వంటరిగా వుండాల్సి వచ్చింది ,తను లండన్ లో వుంటున్నారు.పది నెలలకి నేను కూడ బయలుదేరాను ఒక్కదాన్ని ,ఇకచూడండి ఫస్ట్ టైం ప్లైన్ ఎక్కబోత్తునా అసలు బోర్దింగ్పాస్ అంటే తెలియదు ,టికెట్ ఎలా చూపించాలో తెలియదు ,అలాగని కాం గా వుండలేము కదా ఎన్నో బయాలుమనసులో ఎలా చేరుకుంటనా ? నాకు లండన్ రమ్మని మా వారు నేల ముందు చెప్పారు ,నేను కనిసం రోజుకు రెండు గంటలు ఎలా వెళ్ళాలి ఒక్కదాని అని ఆలోచించుకునేదాన్ని ,సరే ఇది ఇలావుండగా అ రోజు రానే వచ్చింది
.
ఒకపక్క మా వారిని కలసుకోవాలని ఆరాటం ,తప్పదుకదండి ఇక చిన్నగా బయలు దేరాను ఎయిర్ పోర్ట్ కి ప్లేన్ టైం ౭.౩౦ ఇచ్చారు ,నేను ౪.౩౦ వచ్చాను బాబు ఎయిర్ పోర్ట్ కి ,నాకు అసలే హిందీ రాదు వచ్చిన బాష తెలుగు ఏదో అరకొర ఇంగ్లీషు... ఎంటరన్స్ లోని  ఒకడు మేడం మీరు లోపలి వెళ్ళాలంటే పాస్ తీసుకోవాలి ,అని చెప్పాడు అది హిందీలో చెప్పాడు ,నేను దాన్ని ఎలా అర్దంచేసుకోనాన్ను అంటే  తప్పుగా అనుకోవద్దు .......

చెప్పేస్తున్నాను....మరి మా ఫ్రెండ్స్ అంతా ఎమి చెప్పారంటే నీకు ఫస్ట్ చెకింగ్ వుంటుంది అని చెప్పారు ,అందుకనినేను ఓ చెకింగ్ కోసం అయన అలా చెబ్తున్నారు కాబోలా... లోపల మరుగుదొడ్డ్లు వుండవు ఏమో ఇక్కడే పని పూర్తి చేసుకోమన్నారు ఏమో..... అని ఇక బయట ఎక్కడా ఎంత వెతికన కనిపించలేదు ...ఇంక చెకింగ్ కాలేదు (b.pass) తీసుకోలేదు,చివరగా మా ఫ్రెండ్ కనిపించింది తను చెపింది బాబు అమ్మా తల్లి ...లోపలకు రావలిఅంటే  పాస్ తీసుకో అని ఇక నాకు ఒకటే నవ్వులు ....తర్వాత తన పుణ్యాన లోపలి కి వెళ్ళాను ,షరా మాములే .......టికెట్ ,అన్ని తనే చూసుకుంది ...తను నా ప్లేన్ ఇక అప్పుడు గుండెల్లో బాద తగ్గిందండి ,టైం కు ఎక్కేసాం ,ఇలాంటప్పుడు దేవుడు వుంటాడు అనిపిస్తుంది నిజమే కదండి ,ఎప్పుడు వంటరిగా వేల్లలేదండి ,ఇప్పుడు అలవాటైంది ...

ఇక లండన్ వచ్చేసరికి టైం ౧౨.౦౦ అయింది .తను వెళ్ళిపోయింది ,మా వారు వచ్చి నన్ను తీసుకుని వెళ్లారు .ఇక ఇక్కడ అన్ని రూల్స్ .. ఇండియా లో లాగా కాదు ,నేను ఫస్ట్ టైం లండన్ చూడడం ఇక్కడ ఇళ్ళు చుస్తే అగ్గిపెట్టెలు ఒకదానికొకటి అమరిస్తే ఎలావుంటుందో అలా వున్నాయీ ,నాకు పెద్ద డవుటు ఇక్కడ అన్ని సౌకర్యాలు వుంటాయా ....కాని లోపల మాత్రం అన్ని వున్నాయీ మనకేమో వుదయాన్నే లేచి చక్కగా పెడనిల్లు చల్లి ముగ్గులు పెడతాము కదా ఇక్కడ అ వేసిలిటి లేదు ,అన్ని వున్నాయీ కాని నాకు లండన్ బలే నచ్చేసింది ఎటు చుసినా ప్రకాసవంతమైన ప్రకృతి ఏవి చూసినా తాజాగా కనిపిస్తున్నాయీ (ఫ్రూట్స్)....ఇక ఇప్పుడు నేను కూడ లండన్ లో వంటరిగా ఎమితోచగా నా అనుబవాలను   మీతో పంచుకోవాలనిపించిది ,....పంచుకున్నాను ....నేను ఎన్నెల గారికి చెప్పి
చిన్న టపా రాయమని ..కాని కుదరలేదండి రాస్తుంటే వస్తునేవుంది .................
బోర్ కొట్టింది అనుకోకుండా ఒక సారీ చదివేయ్యండి బాబు ...............................


అప్పటికి మా వారిని చూసి దాదాపు పదినెలలు అయింది

8 comments:

  1. Meeru London lo vontariga feel avvadu. Chala telugu families unnai ikkada. Meeru ekkada untaro chepandi

    ReplyDelete
  2. సుమ గారూ,
    మీ పోస్ట్ ఇంకా కాస్త వ్రాసినా చదవాలనిపించేలా ఉంది...నాకు తెలుసుగా మొదలుపెడితే ఆపడం ఎంత కష్టమో..హహహహ
    మీ బోర్డింగ్ పాస్స్ సీన్ మాత్రం....హహహాహ్హాహ్హ్
    ..ఇంక మీ నుంచి టపాలు టప టపా రాల్తాయనుకుంటా..ఇక పేడ నీళ్ళు ముగ్గులు అన్నీ ఆలోచించడం మానేసి ..హ్యాప్పీగా ఎంజాయ్ చెయ్యండి సుమ గారూ.ఇండియా వెళ్ళినప్పుడు ఒక పెద్ద వాకిలి, పేడా అరేంజ్ చేస్తాం లెండి...ముగ్గులు వేసుకుందురుగాని. విష్ యూ గుడ్ టైం అండీ

    ReplyDelete
  3. mee anubhavaalu baagunnayandi..keep on writing

    ReplyDelete
  4. ఎన్నెల గారు మీరు చెప్పినట్లు ఎంజాయ్ చెస్తున్నా౦......
    ఎన్నెల గారు మీరు ఒక టైపు యాసతో కామెంట్ పెట్టాలని కోరుకుంటూ
    (ఇంక మీ నుంచి టపాలు టప టపా రాలాయనుకుంటా)సూపర్బ్ ;
    థాంక్స్ అండి వాకిలి ఆరెంజ్ చేస్తాం అన్న౦దుకు..

    ReplyDelete
  5. @confussion garu
    నేను వంటరిగా వుంటాను అంటే మా వారు ఆఫీసు కి వెళ్ళాక ఇప్పుడు ఇద్దరం కలిసే వుంటున్నాం
    థాంక్స్ అండి మీరు తెలుగు వాళ్ళు వున్నారు అని చెప్పినందుకు మేము ఈస్ట్ లండన్ లో వుంటాం

    ReplyDelete
  6. ధన్యవాదాలు భానుగారు;

    ReplyDelete
  7. చాలా బాగా రాసారండీ...
    నేను లండన్ కాకపోయినా వేరే దేశంలో ఉన్నాను....
    అందుకే.... ఆ కష్టసుఖాలను అర్థం చేసుకోగలను.....
    Keep Writing.......

    ReplyDelete
  8. @maddy garu
    నా బ్లాగు కి స్వాగతం మీరు చెప్పిన్నట్టు రాయడానికి ప్రయత్నిస్తా

    ReplyDelete