Thursday 17 March 2011

వీకెండ్ కబురులు

లండన్ లో మా ఫ్రెండ్ ఒకటి వుంది,అదిఎమో ప్రతిసారి ఫోన్ చేసి సినిమా కి వెళ్దామా ?అని అడుగుతుంది,నాకు ఏమోఒక్క నిమిషము కుడా తీరిక లేని పనులన్నీ మరి వీకెండ్ లోనే వుంటాయి .సరిలే నేను వస్తాను నువ్వు రెడీ అవ్వు అనిచెప్పాను.ఇక మొదలు పెట్టాను పనులను శుక్రవారం సాయంత్రం నుంచి ,వున్నది చిన్నరూ౦ దా౦ట్లో ఒక పక్కగా హనుమయ్య (గాడ్), దాని పక్కన ఫ్రూట్స్ గ్యాలరీ,మొదట గా హనుమయ్య నితుడవడానికి రెడీ అయ్యాను తుడిచి పక్కనే గణపతి,ఇక అయన ఊరుకోడు గా అ పక్క అమ్మవారి ఫోటోలు ,ఇ  లోపల మా ఫ్రెండ్ దగ్గర నుంచి ఫోన్ ఏంటిరెడీ అవుతున్నావా ఆహా! బలే దానివి ఎందుకు రెడీ అవ్వడంలేదు ఇప్పటికి   మొదటగా హనుమయ్యను ఎత్తుకున్నాను అదే నే దేవుడి రూం దానిలోని మొదట ఫోటో ఇంకా గణపతి,వగైరా వగైరా గాడ్ లు వున్నారు ,ఇప్పుడుఇంకా టైం ఉదయం ౧౦.౦౦ కదరా,అదేంటి మనం ఉదయం ఆట కదా  వెళ్ళేది ? దానికే లేవే అబ్బా నువ్వు మాట్లాడుతూవుంటే టైం అయిపోతుందిరా, సరే మరి వుంటాను.నేను మళ్ళా ఫోన్ చేస్తానులే ,వొకే  బాయ్ రా అంతటితో ముగిసింది మొదటి కాల్,నేను మళ్ళి సర్దడం మొదలెట్టా ,గణపతి దగ్గర నుంచి ,అమ్మవారుల ఫోటోల దగ్గరకు ,తరువాత కృష్ణుడు,అనగా గోపాలుడు ,ఇంకా చాలా చాలానే వున్నాయి,అవి అన్ని చెబుతూ వుంటే నాకు సినిమా కి టైం అవుతుంది బాబు,దానితో మొదటి విడత ముగిసింది.
.

ఫ్రూట్స్ గ్యాలరీలో పండ్లు అన్ని ఎలా అంటే అలా పడేసి వున్నాయి,దాంట్లో మొదటి ర్యాకులోద్రాక్షని, రెండవ ర్యాకు లో ప్లంని మూడో ర్యాకు లోస్ట్రాబెర్రీస్ ని, నాలుగువ ర్యాకులోయాపిల్ ని, ఐదవ ర్యాకులోకమలాలు, అరవ ర్యాకులో చర్రి ఫ్రూట్,యిలోపల ఒక ఆలోచనా ,నేను మొదట ర్యాకులో ద్రాక్ష కాకుండా చర్రిని పెడదాము,అయిన ఎవరైనాఇంతసేపు సర్ద్దుతారెంటి!సుమా తప్ప మరలా ఫోన్ ఫ్రెండ్ దగ్గరనుంచి ఎంటిరా (r u ready)ఇప్పుడే ఫ్రూట్స్ గ్యాలరీ కి వచ్చాను రా,అసలు నిన్ను కాదు మీ ఆయనని అనాలి ఇన్ని వెరైటీ ఫ్రూట్స్ తెచ్చినందుకు,అదొక పనిగా సద్డడం ,మధ్యలో ఎందుకు పాపం మా బంగరిని అంటావు అసలే అమాయకుడు, ఫీల్ అవకు  రా వస్తాను,ఇప్పుడు టైం ఎంతో తెలుసా!౧.౦౦ అయ్యింది రా,పర్లేదులే సిని మ్యాక్స్ కె కదా,వెళ్దాం ,మన ఇంటి కి దగ్గర కదా నోప్రాబ్లం ,నో నో సిని వరల్డ్  కి  అయితేనే  నేను వస్తాను, ,ఏ ఎందుకు కాని అ దియేటర్ లో ఏం పెట్టావేంటి? తరువాత చెప్తానులే నువ్వు రెడీ గా,ఫీల్ అవకు మార్నింగ్ షో మిస్ అయింది అని , మ్యాట్ని కి వెళ్దాంలే, సరే మరి నువ్వు పనిగానివ్వు,త్వరగా  బాయ్ రా అని ఫోన్ పెట్టేసింది ,ఇంక ఇప్పుడు  మాత్రం లేట్ చెయ్యకూడదు త్వరగా రెడీ అవ్వాలి అని సుమ పాపం చిన్నగా ఫ్రూట్స్ గ్యాలరీ సర్దడం అయిపొయింది.
.
 ఇక బట్టలుఅమ్మాయి గారు వారాంతం నించి వున్నవన్నీను  వుతుకుతాను అనుకోకండి వాషింగ్ మిషనేలే ఇప్పుడు ఎవరు వుతుకుతున్నారు లే అసలే ఇది లండన్ ఇది ఎమి మా వూరు కాదు బారెడు స్తలం ఇచ్చి వుతుకమ్మా అనడానికి,బట్టలన్నీ వాషింగ్ మిషన్ లో వేసేసి పనులన్నీ పూర్తి చేసుకుని ,మా వారు ఆఫీసు నుంచి వచ్చేసరికి పనులన్నీ అయిపోయాయి,మా ఫ్రెండ్ కి ఫోన్ చేసాను అప్పటికి టైం 6.00 అయింది,పాపం అది ఒకపక్క మ్యాట్ని మిస్ అయ్యింది అని ఎదవ పేస్ ఒకటి అమ్మచాందిని ఎందుకు ఫీల్ అవుతున్నావు.ఎందుకే ఇంత లేట్ చేసావు.నేను చాల ఫీల్ అవుతున్నాను.నా ప్లాన్ అంతా మిస్ అయ్యింది ,ఎమి అయ్యింది రా అని అడిగాను.
.
అప్పుడు చెప్పింది అసలు విషయం !ఇంతకీ సంగతి ఏమిటి అంటే సిని వరల్డ్ లో సినిమా చూడడం కన్నాముందుగాత్రీవ్రమైన కోరిక ఒకటి వుంది .అమ్మాయిగారికి అది ఎమిటిటంటే పాప్ కాన్ అంటే మహా ఇష్టం అది నేను ఎప్పుడుసినిమా కి వెళ్ళినా ,సినిమా చూడడం  తర్వాత ముందు పాప్  కాన్ అంటుంది,దాని భాధ ఏమిటో అర్ధం కాలేదుగామీకు,దియేటర్ లో ఎక్కడైనా పాప్ కాన్ వుండవేమిటి? అని మీ డవుటు, కాదుగా తక్కువ డబ్బులతో మర్రెన్ని పాప్ కాన్ తినాలి అది ప్లాన్,అబ్బా ఇ ట్విస్ట్ ఏంటో  ? సిని మ్యాక్స్ వద్దు సిని వరల్డ్ కావాలని ఎందుకు అంటుందో అర్ధం అయ్యిందా అదేనండి సినివరల్ద్ లో ఆ రోజు ఆఫర్ వుండి ఏడ్చింది లే మాములు గా అయితే 4$ ఒక ప్యాక్ వచ్చి ఇప్పుడు  2$ అట అదిసంగతి...


మనకు వుండనే వుంది కదా వెనకటి కాలం నుంచి ఒక సామెత తింటే గారెలే తినాలి వింటే భారతం వినాలి అని ఇక్కడ మాత్రం తింటే పాప్ కాన్ తినాలి.చూస్తే సిని వరల్డ్ లోనే సినిమా చూడాలి, అసలు ఎంటోమరి అ దియేటర్ ప్రత్యేకత ఏమో గాని అక్కడికి వెళ్ళితే నాకు అయితే అ ప్యాక్ చూస్తే నే తినాలిఅనిపిస్తుంది.ముందు ప్రతి వీక్ ఎండ్ శనివారం ఉదయం వెళ్తాం దియేటర్ కి చెప్తే నమ్మరు గాని రోజు మొత్తం అక్కడే గడిపెస్తాము,అసలు వెళ్ళేది పాప్ కాన్ తినటానికి ఇంకొక విషయం  అ రోజు బాగా మంచు పడింది ఇక్కడ ఏమో బస్సులు  మధ్యలో ఆపేసారు,కాని బాగా వెయిట్ చేసాము ,బస్సులో,మరి చూడండి ఆ పాప్ కాన్ మహిమ మరి నేను ఇండియా లో వున్నప్పుడు ఒక్క సారికూడా తినలేదు పాప్ కాన్ ,అంతే కదా అక్కడ రెండు రూపాయలకి ఇస్తే అది మనకు నచ్చదు ఇక్కడ మాత్రం అదే ప్యాక్ ని 4$ పెట్టి కొని తింటే అప్పుడు అనందం ఎమి చెస్తా౦ రుచి అలాంటిది,మా ఫ్రెండ్ పుణ్యమా అని నాకు కుడా అలవాటైంద పాప్ కాన్ ,మరి మీరు కుడా కానియండి ఈ  పోస్ట్ ఎవరు ఎక్కువ సార్లు చదివితే  వాళ్ళకి అన్ని బోనస్ పాప్ కాన్ ప్యాక్ లు పోస్ట్ చేస్తానులే కామెంట్ పెట్టేటప్పుడు అడ్రస్ రాయడం మరిచి పోకండి అందరికి టాటాలు

Wednesday 16 March 2011

టైటిల్ ఒకరిది పేరు ఒకరికి

మన జనం నమ్మకూడని అనేక విషయాల్ని నమ్ముతున్నప్పుడు ,నమ్మాల్సినవి నమ్మడానికి ఎందుకు అంత వ్యతిరేకిస్తారో నాకు అయితే అర్ధం కావడంలేదు.హైదరాబాదులో ఒకరోజు విశ్రాంతి కోసం ఒక పురాతన దియేటర్ కి వెళ్ళాను. పోస్టరు ఫై బయంకర సినిమా అని వుంది.నగరాలలో జీవించడానికి మి౦చిన బయంకరం  ఏమి వుండదు కాబట్టి దైర్యంగా లోనికి వెళ్ళాను.హల్లో  కొంతమ౦ది కాళ్ళు చాచుకుని నిద్ర పోతున్నారు,మరి కొంతమంది పల్లీలు  నములుతూ  దొమ్లని చరుస్తున్నారు.వున్నట్లు వుండి గోడలు అదిరిపోయే శబ్దం వినిపించింది. నలుగురైదుగురు పారిపోవడానికి ప్రయత్నించారు.గేట్ కీపర్ అడ్డుకొని ఫ్యాన్ లు ఆన్  చేసినప్పుడు అదే శబ్దం వస్తుంది .అది మా ప్రత్యేకతని సర్దిచెప్పాడు

.
.
సినిమాప్రారంభమైంది ,చూడడమా,నిద్రపోవడమా అని నిర్ణయం తీసుకునే లోపల కాళ్ళపై ఏదోపాకింది వులిక్కిపడి విదిలించాను.సన్నటి వెలుతురులో ఒక ఎలుక కనిపించింది.దియేటర్లో నల్లులువుంటాయని తెలుసు మా వూరిలో ఇప్పటికి నల్లులని చంపుతూ చంపుతూ తీరిక దొరికినప్పుడు సినిమా చూస్తూవుంటారు. అ ఎలుక నన్నుచూసి బయపడకుండా ముందు కాలితో ముక్కు గిరుకుంటూ వెక్కిరించింది.ఒళ్లు మండి కుర్జీ చేతి ని లాగాను ఊడోచ్చి౦దిఅ ఎలుక నన్ను చూసి కవ్విస్తూ బాల్కనీ మెట్లుక్కి,నేరుగా ప్రొజెక్టర్ రూం లోకి దూరింది.ఆపరేటర్ నిద్రలో వున్నాడు రెండు ఎలుకలు అతని మిసాలపై వ్రేలాడుతున్నాయి,తల తిప్పి చూస్తే కనీసం పది ఎలుకలు కొలువు తీరివున్నాయి.

ఎలుకల్ని కొట్టడం పెద్ద గొప్పఅనుకుంటున్నావా?.ఒక ఎలుక కోప్పడింది మనుషులు ఎలుకల్లా కలుగుల్లో జీవిస్తు న్నప్పుడు,ఎలుకలు మనుషుల్లా మాట్లాడడం వింతగా అనిపించలేదు.డిస్టర్బ్ చెయ్యద్దుమేమంతా కలిసి సినిమా కధ తయారుచేస్తున్నాం. అని ఒక ఎలుక చెప్పింది.ఎలుకలకి సినిమాలకి సంభ౦దేమిటి? .ఒక సీన్ కి ఇంకొక సీన్ కి సంభంధం లేకుండా సినిమాలోస్తున్నపుడు,అనవసరంగా సంభందాల గురించి మాట్లాడకు.

మనుషులు తీసే సిని మాలు ఎలుకలకె నచ్చనప్పుడు ,ఎలుకలు చెప్పే కధలుమనుషులకి నచ్చే అవకాశం వుంది.కదా !ఈ లాజిక్ అర్ధం కాలేదు అన్నాను ,లాజిక్ గురించి ఆలోచిస్తే లైఫ్ లో  మ్యాజిక్ పోతుందని హిత బోధ చేసింది సినిమా కి తమకివున్న రిలేషన్ షిప్ గురించి ఒక ఎలుక ఉపన్యాసం ఎత్తుకుంది.ఈ దియేటర్ లో కాపుర ము౦డడం వల్ల మా  జీన్స్ లో సినిమా ఇంకి పోయింది ,ప్రేక్షకులు ఎప్పుడు నిదరపోతారో,ఎప్పుడు గురక పెడతారో మాకు తెలుసు.కాబట్టి బోర్ కొట్టే సిన్స్ ని మేమే పళ్ళతో కొరికి ఎడిట్ చేసెవాళ్ళం, ఆపరేటర్ ఒకొక్కసారి కొన్ని రీళ్ళని మరిచిపోయి సినిమా చూపించే వాడు .ఇదంతా చూసిన తరువాత సినిమాకి కధ చేయడం పెద్ద గొప్పె౦ కాదనిపిం చింది .ఎవడికో ఒకడికి కధను అమ్మేసి డబ్బుసంపాదించేస్తాం అని చెప్పింది .ఎలుకలకి డబ్బుఎందుకు ? డబ్బు సంపాదించిన తరువతా మమ్మలి ఎలుకలుగా ఎవరు  గుర్తించరు............

ఇంతకీ కధెంటీ? సినిమాలన్నింటికీ మూలకధలు ఒక నాల్గుఐదు వుంటాయి హిరో హిరోయిన్లు ప్రేమించుకుంటారుమధ్యలో విడిపోతారు, చివరిలో కలుసుకుంటారు, అప్పుడప్పుడు ,కుదిరితే ఓ కప్పు కాఫి అంటారు.....కుదరక పొతే ఒక పెగ్గు మందు అంటారు. ఇంకొక కధలో హిరో అంబాజీపేట లో ఆముదం అమ్ముతూ వుంటాడు. అక్కడ కి చమురు కోసం వెళ్ళిన పెద్దాయన హీరోని గుర్తిస్తాడు. ప్లాష్ బ్లాక్,పైటింగ్ ది ఎండ్ ఒక లైన్ లో కధ ఎవరైనా చెబ్తారు మొత్తం చెబితే కదా గొప్ప అన్నాను.
.
అన్నానికి ఒక మెతుకు సినిమా కి ఒక సీన్ చూస్తే చాలుసినిమాను స్క్రీన్ మీద కాకుండా రీళ్ళ మీద చూసిన వాళ్ళం ఇంతలోఆపరేటర్ నిద్రలేచే ప్రయత్నం చేస్తే ఎలుకలన్నీ రీళ్ళ వెనక్కి  దూరిపోయాయి నా చేతిలో కర్ర చూసి ఆపరేటర్ దడుచుకుకొని తీసినవాళ్ళని ,తన్నాలికాని చూపించిన వాణ్ణి తన్నడం ఎమి న్యాయం? అన్నాడు నువ్వు నిద్ర లేచి ప్రేక్షకులని నిద్ర లేపకు . ,  . అని వచ్చేసాను .

వారం తరువాత అదే దియేటర్ కి వెళ్ళాను ప్రొజెక్టర్ రూంకి వెళ్తే ఎలుక దిగాలుగా కూర్చుని వుంది.మిత్రమా కధ ఎంత వరకు వచ్చింది? కాటి వరకువచ్చింది.ఎలుకలు వున్న చోట పిల్లి కూడ వుంటుంది అని తెలుసుకోవడం జ్ఞాన౦.అ పిల్లి మా మిత్రుల్నితినేసి మా కధను కుడా జీర్ణం చేసుకుంది .ఒకే ఒక ఎండు చేపల బుట్టకి కధను అమ్మేసింది.అయిన కధలోతప్ప జీవితంలో నీతి ఎక్కడ వుండి ఏడ్చింది.విసురుగా వెళ్ళిపోయింది. ఎలుక విన్నా వినకపోయినా చెప్పడం నా ధర్మం సినిమా కధను ఎలుక తయారు చెయ్యడం గొప్ప కాదు ,దాన్ని పిల్లి మి౦గేసి టైటిల్ కార్డ్డులో తన పేరు వేసుకోకుండా చూడాలి. అది సంగతి ....  
.
          .

Wednesday 9 March 2011

లండన్ లోని ఆసుపత్రులూ .....

ఆహా ! కడుపు రగిలిపోతుంది దూరపు కొండలు నునుపు అంటే ఇదేనేమో మొన్నటి కి మొన్న ఎవరో రాసారు విదేశాలలో  వుండాల లేక స్వదేశంలో వుండాల అని ,,ఎప్పుడైనా సాటి మనిషి కి ఆరోగ్యం బాగొలేనప్పుడు చూడలేని డాక్టర్  నా దృష్టిలో డాక్టరే  కాదు, అప్పుడు కుడా రూల్స్ పాటించే సొసైటి వీరిది(లండన్ ) ,అయినా  దయచేసిచేబుతున్నాను ఇక్కడ(లండన్ ) వుండే తెలుగు వాళ్ళకు విన్నపం ఏదైనా ప్రాబ్లం  వుంటే ఇండియా కి వెళ్లి చూపించండి .ఇక్కడ మాత్రం వద్దు ఎందుకో చెబ్తాను, నేను ప్రాబ్లం వుండి ఆసుపత్రి కి వెళ్ళాను మాకు దగ్గరగా వుండే క్లినిక్ కి మొదట వెళ్ళాను ,అక్కడ GP registeration వుంటే చూస్తాము అన్నారు ,సరే తర్వాత వేరే క్లినిక్  వెళ్ళితే అక్కడ కూడ అదే పరిస్తితి ఎదురైంది ,కాని మీరు అనుకోవచ్చు  ప్రాబ్లం ఏంటి  registeration చేయించుకుంటే చూస్తారు కదా అని మీరుఅనుకోవచ్చు.అసలు GP REGISTERATION  అంటే ఏమిటో చెబుతాను మనం లండన్ లో ఆసుపత్రికి వెళ్ళాలి అంటే ముందుగా రిజిస్టర్ చేయించుకోవాలి అప్పుడు మనం అర్హులుగా గుర్తిస్తారు.మీకు  మా ఫ్రెండ్ కి జరిగిన  సంఘటన గురించి చెప్పాలి.


ఇక్కడ మా ఫ్రెండ్ కి ఫీవర్ గా వుంటే చూపించుకోవడానికి ఆసుపత్రి కి వెళ్ళింది. తనకి GP వుంది మొదటి రోజు BP  చూసారు అది చూడడానికి ఒకరోజు మొత్తం పట్టింది. తనకి అప్పటికే ఫీవర్ బాగా ఎక్కువైంది ,వాళ్ళు చెప్పిన విషయంఏమిటి అంటే రిపోర్ట్స్  ఇంటికి వస్తాయి ,తర్వాత ప్రాసెస్ జరుగుతుంది అని చెప్పారు అవి వచ్చేసరికి ఒక వారం పట్టింది యిలోపల తనకి జ్వరం కుడా తగ్గిపోయింది. ఇది ఇలా వుండాగా నేను వెళ్ళాను ఆసుపత్రికి  అక్కడ మొదట రిసెప్షన్ లో ప్రాబ్లం ఏంటి అని అడిగారూ ,అక్కడ చెప్పాను ,తర్వాత రెండు గంటల సమయం తర్వాత లోపలికి వెళ్ళాను అక్కడ డాక్టర్ ప్రాబ్లం చెప్పించుకుని టెస్ట్లు లు చేసారు డాక్టర్ ఒక స్లిప్ మీద ప్రాబ్లం రాసి అక్కడే వేరే డిపార్టుమెంటు కి పంపించాను.

 అక్కడికి వెళ్ళమని చెప్పాడు. సరే అక్కడ ఒక రెండు గంటల సమయం పట్టింది ,వుదయం నుంచి ఎమి తినకుండా వెళ్ళాను ,మన ఇండియా లో లాగా త్వరగా అయిపోతుంది(ఆసుపత్రి పని ), అని అంతా రివర్స్ అయింది.అయ్యో అక్కడ నుంచి కునికిపాట్లు పడుతూ చిన్నగా ఒక హాల్ లో కూర్చో పెట్టారు ,అక్కడ కూడ ఒక గంట సమయం తర్వాత లోపలికి వెళ్ళాను నా తో పాటు మా ఫ్రెండ్ కూడ వచ్చింది .ఇద్దరం లోపలికి వెళ్ళాము ,అక్కడ డాక్టర్ నన్ను ప్రాబ్లెం అడిగి పేపర్ మీద రాసుకున్నాడు ,నన్ను  ముందు ఒక డాక్టర్ చూసాడు ,టెస్ట్లు అన్ని చేసాడు ,మళ్ళి యితను అన్ని  అడుగుతాడు.
.
ముందు యిచ్చిన పేపర్ మీద అన్ని వున్నాయి  చూడచ్చు కదా చూడరు అసలే నాకు ఒకపక్క ఆకలి ,నీరసం ,ఎన్నిసార్లు చెబుతూ౦  తీర చెప్పాక నాకు విషయం ఏమిటో చెప్తాడు అంటే చెప్పకుండా మా ఫ్రెండ్ తో సొల్లు వేసుకుంటాడు. అక్కడ ఒక ౨౦ నిముషాలు దండగ తీర డాక్టర్ తేల్చింది ఏమిటంటే తను కూడ పేపర్ మీద ప్రాబ్లం రాసి మళ్ళి లేడి డాక్టర్ దగ్గరకి పంపారు ,అప్పటికి టైం 3.00 యిక మళ్ళి యివిడ టెస్ట్లు లు మళ్ళి మొదటి నుంచి స్టార్ట్ చెయ్యడం నాకు ఓపికలేదు ఇంక అంటే మా ఫ్రెండ్ ఏమో సుమో.. ఇ వక్కసారి చెప్పవే సరే గాని అని  నేను... తీరా అంతా అయ్యాకా ఇవిడ కంప్యూటర్ ముందు ఒక నాలుగు గంటలు కూర్చుని తర్వాత వైటింగ్ హల్ కి వచ్చి అయ్యో సారీబాగా లేట్ అయింది అనుకుంటాను అని......

 ఆవిడ నా మొహం మీద టాబ్లెట్స్ పడేసింది ,తీర ఒక  రోజు అంతా గడిపితే  ఆవిడ చివరి తీర్పు ఏమిటంటే మీరు వేరే ఆసుపత్రిలో చూపించుకోండి.ప్రాబ్లెం ఏమిటో తెలియలేదు నేను నాకు తెలిసన మందులు ఇస్తాను అని  చెప్పింది దానితో రోజు అంతా ముగిసింది, అంచేత నేను చెప్పదలుచుకున్నది ఎమిటిటంటే   మన తెలుగువాళ్ళు ఎవరైనా లండన్ లో వుంటే  హెల్త్ ప్రాబ్లెమ్స్ వస్తే  ఇండియా కి వెళ్లి చూపించు కోండి అయన ఇక్కడి ఆసుపత్రి చూడడానికి అందంగా వున్నా అది కల్పితం  మాత్రమే లోపల అసలు విషయం వుండదు.

అబ్బా నేను అనుకున్నాను, మొదట ఆసుపత్రిని చూసి ,చాల బాగా చూస్తారు అని ,కాని మన పెద్దలు చెప్పింది నిజం(పైన చెప్పిన సామెత )  బ్రహ్మనందం మన్మధుడు సినిమా లో చెప్పాడు గా అయ్యో ఇది పారిస్ అండి ఇండియాని   కొన్నియుగాలు ముందుకు తిప్పితే అది పారిస్ ఇక్కడ అన్ని లేటెస్ట్ గా వుంటాయి ,ఏమో మరి అన్ని వుంటాయేమో చూడడానికి మాత్రమే పనికి రావడానికి కాదు , ఎందుకు ఎడవను,పై పై మెరుగులకు మోసపోకండి.

ఒకమంచిమాట,పలకరింపు,అభిమానం ఇవ్వన్ని కావాలంటే మన ఇండియాకి  వెళ్ళాల్సిందే ఎమిటోనండి నాఅనుభవాన్ని మీతో పంచుకున్నాను ,మన వాళ్ళు కదా అని చెప్పాను ఇక మీ ఇష్టం అసలు మేము మొదట మెయిన్ ఎంట్రన్స్ దగ్గర అడిగాం మేడం అర్జెంటు గా డాక్టర్ కి కలవాలి అని మా ఫ్రెండ్ అడిగితే ,నో మేడం ఎంత అర్జెంటు అయిన విత్ అవుట్ రిజిస్టర్ మేము చూడం అని చెప్పింది ,(మాకు  GP  లేదండి) కాని ఆవిడ కనిసం పక్కనే వాక్ ఇన్ సెంటర్ వుంది చూపించు కోండి అని కుడా చెప్పలేదు ,అంత హినాతి హీనం జనం పరిస్తితి  అదే మన ఇండియా లో అయేతే ఎప్పటికి జరగదు ఎంతైనా I LOVE MY INDIA  somuch మీరు ఎమి అనుకుంటున్నారో త్వరగా చెప్పేయండి ......
  ,

Thursday 3 March 2011

మా ఓనర్ తో గొడవ (సరదాగా)

ఈ   రోజు  ఉదయాన్నే  లేవగానే  అనుకున్నాను, కొంచెం ఓనర్ గారి గురించి రాద్దామని ,అలాగేనండి  చెప్పక తప్పట్లేదు .ఏమిటో నేను లండన్ రాక ముందు మా వార్ని ఇల్లు చూడమని చెప్పాను. అలాగే చూస్తాను అన్నారు నువ్వు రావడానికి ఒక నేల టైం పడుతుంది కదా ,త్వరలో చూస్తాను అని చెప్పారు ,చిన్నగా ఇల్లు వెతకడం  మొదలుపెట్టారు .ఎక్కడ చూసినా నాన్ వెజ్  ఫ్యామిలి  తోనే షేర్ దొరుకుత్తున్నాయి .కాకపోతే మనకు ఆ వాసన పడదు ,ఇకమనం వండుకోవడానికి ఏమో వాళ్ళు వోప్పుకోవడం లేదు ,కొన్ని ఇళ్లలో లంచ్ వరకు మీరు చేసుకోండి నైట్ కి డిన్నర్ మాత్రం మేము ప్రేపరే చేస్తాం అంటున్నారు , ఇ లోపల నాకు ఏమో తొందర ఎప్పుడెప్పుడు లండన్ వెళ్దామా అని  మా వారిని ఒకటే గోలా త్వరగా ఇల్లు చూడు అని ఎట్టకేలకు  ఒక ఇల్లు చూసారు ,ఆ ఇల్లు ఓనర్స్ గుజరాతి వాళ్ళు అయిన వెజిటేరియన్ వాళ్ళు ,ఇల్లు చూడడానికి చాల బాగుంటుంది


అంటే దాంట్లో కొన్ని కిసుకులు తప్పవు కదా  ఇల్లు బాగుండగానే సరిపోదు ,నేను లండన్ వచ్చినప్పటి నుంచి అదే ఇంటిలో వుంటున్నాం , ఇల్లు రెంట్ ఎంతో కాదు లే అండి బాగా చవక (అని వాళ్ల దృష్టి లో ) మన ఇండియన్ దానితో పోల్చుకుంటే నలబై రెండు వేలు ,అయిన పరవాలేదు ఇల్లు నిట్ గా వుంది ఒప్పుకోక తప్పలేదు ఇంటిలోకి అడుగు పెట్టడంతోనే ఎక్కడ చూసినా పోస్ట్లర్లు ఏంటి బాబు అనుకుంటే అవి ఎమిటోకాదు మొదట గా అమ్మాయిలకి  కనిపించేది వంటిల్లు ,అందులోకి వెళ్ళగానే రూం అంతా కబ్ బోర్డుల తోనూ  ఒక చిన్న డైనింగ్  టేబుల్ ,ఒక పక్క పౌడర్స్ పోసుకోవడానికి వైట్ బాక్స్ లు ,ఒక పక్క డబుల్ డోర్ ప్రిజ్, దాని పక్కన ,గ్యాస్  అదికూడా నాలుగు.బర్నలు ,మన లాగా సిలిండర్ మాత్రం లేదు ,పైప్ సిస్టం ,తర్వాత కబ్ బోర్డులలో దేనికి దానికిపప్పులు అమరిక ,వీళ్ళకి మన దగ్గర లాగా పెద్ద వాకిళ్ళు వుండవు కదు అందుకని కిటికీ కి దగ్గరగా, ఒక చిన్ని కుండీలో తులసి మొక్క ,ఇంకొక బారు కుండీలో వుల్లి మొక్కలు అవి పూలూ పూసి అందంగా ఎల్లో కలర్ లో వున్నాయి .


చుట్టూ గ్లాస్ విండోలు ,దాని వెనక ,ఇ పూలూ ,ఇక మధ్యలో కడుక్కోవడానికి బేసిన్ అది మాత్రం మన దగ్గర లాగా లీకేజ్ వుండదు,నాలుగు రోజులుకొకసారి ప్లంబర్ ని పిలవక్కర్లేదు ,ఆ పక్కనే డస్ట్ బీన్ దానికొక  పోస్టరు ,అదిఎమిటోకాదు (dont put recycle bin ,paper,etc) ,ఒకసైడ్ బుజ్జి ట్రే వుల్లి పోసుకొవడానికి ,అదండి వంటింటి సంగతి  అప్పుడే అయిపోయింది అనుకోవద్దు ఇంకా బెడ్ రూం బాతురూం,హల్ లేదూ  హమ్మయ్యా అనుకోండి అంతవరకూ మీరు అదృష్టవంతులు ఇంక చదవాల్సినవి రెండే కదా అని......................


బాతురూం గురించి చెప్పాలంటే అసలు ఇల్లు తీసుకున్నదే దాని కోసం నాకు బాతురూం నిట్ గా లేకపోతె అసలు వుండలేను, ఇందులో కుడా కబ్ బోర్డులు ఎవరి సామాను వారు పెట్టుకోవడానికి ,ఇకపోతే బాత్ టబ్బు ,సినిమాలోచుపించేటట్టు ,ఇక మీరు ఉహించుకో౦డి షవరు ,ఒక వైపు వేడి నీళ్ళు ఒక వైపు చన్నీళ్ళు టాప్ తిప్పితే ,ఇదంతా బాగానే వుంది అక్కడ కూడ ఒక పోస్టరు (both room is everything put cleanly, if u dont know how to use u asksomeone) దాని పక్కన వెస్ట్రన్ టాయ్లెట్ అడుగన మొత్తం చెక్కతో ల్యాండ్ అయ్యి వుంటుంది దానితో బెడ్ రూం ఓవర్


 ఇక బెడ్ రూం గురించి కొంచెం చెప్పేస్తా ఇక మిమ్మల్ని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు , మేము వుండే సామ్రాజ్యం మా సార్ గారి రూం ,ఇందులో పెద్ద రెండు చక్క బీరువాలు ,ఒకటి మా వారికి ,ఒకటి నాకు ,ఇకపోతే అన్ని బాగున్నాయి, మా హనుమయ్య (గాడ్) ని ఎక్కడ పెట్టాలి ఓ తెగ పూజలు చేసేదానికిలాగా దేవుడి సామాను దాంతో పాటు కుందులు వగైరా వగైరా అన్ని తెచ్చేసుకున్నాను. ఇక్కడ గోడకు అతిక్కిచ్చి చిన్న పిట్టగోడ దాని మీద సగం దేవుడి సామాను సగం మా సార్ గారి పుస్తకాలూ ,వుంది చిన్నరూం  దాంట్లో మధ్యలో డబల్ కాట్ ,రెండు బిరువాలలో, ఒకదానికి మిర్రర్ ,అంతా బాగానే వుంది ఇక్కడ కుడా ఒక పోస్టరు ( dont do dipaarajana in bedroom) గోడలన్నీ తెల్లగావున్నాయీ పాడు చెయ్యదు గద్గది సంగతి .....


ఇల్లు గురించి చెప్పడం అయింది ,ఇంతకీ గొడవ ఏమిటంటే నేను రోజు లంచ్(ప్రిపేర్) నేను చేస్తాను ,డిన్నర్ తను చేస్తుంది తనకేమో అన్ని ఎక్కడ తీసినవి అక్కడ పెట్టాలి ,మనకి మరిచిపోయే రోగం వంట చేసేటప్పుడు విండో తియ్యమంటుంది అలాగే కొంచెం ఓపెన్ చేసి చేసుకుని మేము డైలీ చపాతీ చేసుకుని ,కర్రీ చేస్తాను ,కాని అంతా బాగానే పెట్టాను పాన్ కడగలేదని గొడవ ,మరి విండో వెయ్యడం మరిచా అంతే. ఇక ఉకదుంపుడే ,ఇక మా సార్ గారు అప్పుడే ఆఫీసు నుంచి రాక తను చెప్పింది అయ్యో నేను చెప్పాను మరిచా అంతే అని ఇప్పుడు సెట్ అయ్యిందిలెండి ఏం చేస్తాం ఒకటి కావాలి అంటే ఒకటి సర్డుకోక తప్పదు మరి .... మొత్తానికి నాకు ఇల్లు బాగా నచ్చేసింది.......


మీకు నచ్చేసిందో లేదు త్వరగా చెప్పేయండి. ఏంటి మన గురించి చిప్ గా ఆనుటు౦ది అనుకోకండి ఎంతైనా దూరపుకొండలు నునుపు కదా సామేత వుండనే వుంది కదు ఇంతకీ మీకు డవుటు రావచ్చు వీళ్ళు ఇండియా వాళ్ళే కదా కాని ఇల్లు గల్ల ఓనర్స్ మాత్రం ఇండియా నుంచి ఇక్కడ సెటిల్ అయ్యారు .అయిన ఇక్కడికి వచ్చాక మన ముందు సంగతి ఏమిటో మరిచిపోతారు జనం మా ఓనరు నేను ఏదైనా తప్పు చేశాను అనుకో అంతే నాకు తెలుసు ఇండియా నుంచి వచ్చిన వాళ్ళకు ఇవి ఎప్పుడు చూసి వుండరు ఎలా వాడుకోవాలో తెలియదు ఇంకొక విషయం తను ఇండియన్  నాకు ఫస్ట్ లో కోపం వచ్చేది ఆ మాటలకి అయిన ఇల్లు బాగుంది గదు ఇవన్ని దాని ముందు ఎంతమీరు  లైట్ తీసుకోండి .

Wednesday 2 March 2011

అందమైన ఫొటోస్ మీకోసం

చిలుకల  ఫొటోస్  .......... చూసి ఎలా వున్నాయో చెప్పాలి మరి ఇందులో ఒక ట్విస్ట్ వుంది కనుక్కో౦డి చూద్దాం ... .


.



Monday 28 February 2011

ఓ అమయకురాలి కష్టాలు .......

మాది ఒక చిన్న పల్లెటూరు అందులో ఒక చిన్న కుటు౦బం  అమ్మ ,నాన్న,తమ్ముడు ,నేను ,చిన్నప్పటి నుంచినాకు కొంచెం కోపం ఎక్కువ ,ఎది అయిన నాకు ముందు చెయ్యాలి అనే తపన ,బొమ్మలు మా నాన్న రెండు తీసుకోనివస్తే అందులో ఎది బాగుంటే అది నేను వుంచుకొని మిగతాది మా తమ్ముడికి ఇచ్చేదాన్ని ,సరే నాన్న కు అమ్మాయిలు అంటే ఇష్టం ,ఎందుకు ఇష్టం చెప్పనా మా చిన్నానకు ,పెదనాన్న కు ,ఇంకో బాబాయి కి అందరికి అబ్బాయిలు పుట్టారు అందుకని యింట్లోకి మొత్తానికి నేనంటే ఇష్టం ,యిక యివిడగారు చెప్పిందే రాజ్యం ...ఇలా వుండగా పెళ్లి గడియలు రానేవచ్చాయీ ,నేను పిజీ పూర్తి చేసుకొని జాబ్ కోసం ఇంటిలో వాళ్ళు హైదరాబాద్ పంపిచారు .నేను వెళ్ళాను
ఒక సంబందం వచ్చింది అది కుదిరన వెంటనే త్వరగా పెళ్లి చేసుకున్నాను .

అ తర్వాత ఎమి జరిగింద౦టే,నేను కొన్ని రోజులు వంటరిగా వుండాల్సి వచ్చింది ,తను లండన్ లో వుంటున్నారు.పది నెలలకి నేను కూడ బయలుదేరాను ఒక్కదాన్ని ,ఇకచూడండి ఫస్ట్ టైం ప్లైన్ ఎక్కబోత్తునా అసలు బోర్దింగ్పాస్ అంటే తెలియదు ,టికెట్ ఎలా చూపించాలో తెలియదు ,అలాగని కాం గా వుండలేము కదా ఎన్నో బయాలుమనసులో ఎలా చేరుకుంటనా ? నాకు లండన్ రమ్మని మా వారు నేల ముందు చెప్పారు ,నేను కనిసం రోజుకు రెండు గంటలు ఎలా వెళ్ళాలి ఒక్కదాని అని ఆలోచించుకునేదాన్ని ,సరే ఇది ఇలావుండగా అ రోజు రానే వచ్చింది
.
ఒకపక్క మా వారిని కలసుకోవాలని ఆరాటం ,తప్పదుకదండి ఇక చిన్నగా బయలు దేరాను ఎయిర్ పోర్ట్ కి ప్లేన్ టైం ౭.౩౦ ఇచ్చారు ,నేను ౪.౩౦ వచ్చాను బాబు ఎయిర్ పోర్ట్ కి ,నాకు అసలే హిందీ రాదు వచ్చిన బాష తెలుగు ఏదో అరకొర ఇంగ్లీషు... ఎంటరన్స్ లోని  ఒకడు మేడం మీరు లోపలి వెళ్ళాలంటే పాస్ తీసుకోవాలి ,అని చెప్పాడు అది హిందీలో చెప్పాడు ,నేను దాన్ని ఎలా అర్దంచేసుకోనాన్ను అంటే  తప్పుగా అనుకోవద్దు .......

చెప్పేస్తున్నాను....మరి మా ఫ్రెండ్స్ అంతా ఎమి చెప్పారంటే నీకు ఫస్ట్ చెకింగ్ వుంటుంది అని చెప్పారు ,అందుకనినేను ఓ చెకింగ్ కోసం అయన అలా చెబ్తున్నారు కాబోలా... లోపల మరుగుదొడ్డ్లు వుండవు ఏమో ఇక్కడే పని పూర్తి చేసుకోమన్నారు ఏమో..... అని ఇక బయట ఎక్కడా ఎంత వెతికన కనిపించలేదు ...ఇంక చెకింగ్ కాలేదు (b.pass) తీసుకోలేదు,చివరగా మా ఫ్రెండ్ కనిపించింది తను చెపింది బాబు అమ్మా తల్లి ...లోపలకు రావలిఅంటే  పాస్ తీసుకో అని ఇక నాకు ఒకటే నవ్వులు ....తర్వాత తన పుణ్యాన లోపలి కి వెళ్ళాను ,షరా మాములే .......టికెట్ ,అన్ని తనే చూసుకుంది ...తను నా ప్లేన్ ఇక అప్పుడు గుండెల్లో బాద తగ్గిందండి ,టైం కు ఎక్కేసాం ,ఇలాంటప్పుడు దేవుడు వుంటాడు అనిపిస్తుంది నిజమే కదండి ,ఎప్పుడు వంటరిగా వేల్లలేదండి ,ఇప్పుడు అలవాటైంది ...

ఇక లండన్ వచ్చేసరికి టైం ౧౨.౦౦ అయింది .తను వెళ్ళిపోయింది ,మా వారు వచ్చి నన్ను తీసుకుని వెళ్లారు .ఇక ఇక్కడ అన్ని రూల్స్ .. ఇండియా లో లాగా కాదు ,నేను ఫస్ట్ టైం లండన్ చూడడం ఇక్కడ ఇళ్ళు చుస్తే అగ్గిపెట్టెలు ఒకదానికొకటి అమరిస్తే ఎలావుంటుందో అలా వున్నాయీ ,నాకు పెద్ద డవుటు ఇక్కడ అన్ని సౌకర్యాలు వుంటాయా ....కాని లోపల మాత్రం అన్ని వున్నాయీ మనకేమో వుదయాన్నే లేచి చక్కగా పెడనిల్లు చల్లి ముగ్గులు పెడతాము కదా ఇక్కడ అ వేసిలిటి లేదు ,అన్ని వున్నాయీ కాని నాకు లండన్ బలే నచ్చేసింది ఎటు చుసినా ప్రకాసవంతమైన ప్రకృతి ఏవి చూసినా తాజాగా కనిపిస్తున్నాయీ (ఫ్రూట్స్)....ఇక ఇప్పుడు నేను కూడ లండన్ లో వంటరిగా ఎమితోచగా నా అనుబవాలను   మీతో పంచుకోవాలనిపించిది ,....పంచుకున్నాను ....నేను ఎన్నెల గారికి చెప్పి
చిన్న టపా రాయమని ..కాని కుదరలేదండి రాస్తుంటే వస్తునేవుంది .................
బోర్ కొట్టింది అనుకోకుండా ఒక సారీ చదివేయ్యండి బాబు ...............................


అప్పటికి మా వారిని చూసి దాదాపు పదినెలలు అయింది

Friday 25 February 2011

అహంకారం ఎంత ప్రమాదమో ..........

అనగనగా ఒక అడవిలో ఒక నెమలి ఉండేది. దానికి గర్వం ఎక్కువ. అన్నిటి కంటె తాను బాగా నృత్యం చేయగలననీ, అందరి కంటే తానే అందంగా ఉంటానని భావించేది. అంతేకాక ఇతర పక్షుల పట్ల చులకన భావం కలిగి ఉండేది. ఒకసారి అడవిలో ఉండే జంతువుల, పక్షుల సమావేశం జరిగింది. ఆ సమావేశం లో నెమలి మిగిలిన పక్షుల గురించి హేళనగా మాట్లాడసాగింది.


కాకితో ‘‘నువ్వు నల్లగా, అందహీనంగా ఉంటావు. ఇంత అందహీనంగా ఉన్న నువ్వు ఎలా బతుకుతున్నావు? నేనైతే ఎప్పుడో చచ్చిపోయేదాన్ని’’ అని బడాయిగా చెప్పింది. పక్కనే ఉన్న పావురాన్ని కూడా వదిలి పెట్టలేదు. ‘‘నువ్వు పాలిపోయిన రంగులో ఉంటావు. అస్సలు అందంగా ఉండవు’’ అని నిందించింది. ఇతర చిన్న పక్షుల్ని కూడా హేళన చేసింది. ‘‘మీరు గుప్పెడు కూడా ఉండరు. మీ అందరి కంటే నేను అందంగా ఉంటాను. మీరంతా నా తర్వాతి స్థానంలో ఉంటారు. అడవిలో పక్షులన్నిటికంటే నేనే గొప్ప మనుషులందరూ నన్నే ఇష్టపడతారు’’ అని గొప్పలు చెప్పుకుంది.




నెమలి వ్యవహారశైలితో మిగిలిన పక్షులన్నిటికీ నెమలి మీద కోపం వచ్చింది. ఎలాగైనా దానికి బుద్ధి చెప్పాలనుకున్నాయి. ‘ఏం చేయాలబ్బా!’ అని ఆలోచించసాగాయి. ఒకసారి నెమలి అన్ని పక్షులనీ పిలిచి, రోజురోజుకీ నృత్యంలో తన ప్రతిభ ఎలా పెరిగిపోతోందో చూడమని నృత్యం చేయసాగింది. ఇంతలో అటువైపుగా ఒక వేటగాడు రావటాన్ని మిగిలిన పక్షులు గమనించాయి. పక్షులన్నీ నెమలికి విషయం తెలియజెప్పకుండా ఒక్కొక్కటిగా నెమ్మదిగా జారుకున్నాయి.


అహంకారంలో తేలియాడుతున్న నెమలి వేటగాడిని గమనించలేదు. మిగిలిన పక్షులు ఎందుకు వెళ్లిపోతున్నాయో కూడా తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. ఇంతలో వేటగాడు వల విసిరి నెమలిని పట్టుకున్నాడు. వలలో చిక్కుకున్న నెమలి, తనకు సహాయం చేయమని ఇతర పక్షుల్ని ప్రాధేయపడింది. కానీ పక్షులు ఏవీ నెమలికి సహాయపడటానికి ముందుకు రాలేదు. ‘‘గర్విష్టి నెమలికి తగిన శాస్తి జరిగింది.

తోటి పక్షులం అని మనల్ని గుర్తించకుండా, దేవుడిచ్చిన రూపాన్ని అర్థం చేసుకోకుండా ఎంతగా హేళన చేసింది. ఇటువంటి వారికి ఇలానే జరుగుతుంది. వీరికి దేవుడే బుద్ధి చెప్పాడు’’ అన్నాయి. కాని నెమలిలో కలిగిన పశ్చాత్తాపాన్ని గమనించిన ఒక వృద్ధపక్షి, నెమలిని రక్షించమని మిగిలిన పక్షులకు చెప్పింది. పశ్చాత్తాపానికి మించినది లేదని నీతి చెప్పింది. నెమలికి బుద్ధి వచ్చినందుకు సంతోషపడిన మిగిలిన పక్షులు, తమ యుక్తిని ప్రద ర్శించి నెమలిని వేటగాడి వల నుంచి రక్షించాయి.



నీతి: అహంకారంతో విరవ్రీగకూడదు. దేవుని సృష్టిలో అందరూ సమానమే.






 

Thursday 17 February 2011

అద్దెకొంపలో -ఆత్మారాముడు

ఒక అర్దరాత్రి సమయంలో యిద్దరు అతిధులు ఆశ్రమం కోసం ఓ ఇంటి తలుపు తట్టారు .ఇంటి యజమాని తలుపు తీసిఆ యిద్దరి వివరాలు అడిగాడు .వారి గురించి తెలుసుకుని ఒకరికే ఆశ్రమం యిచాడ్డు.

రెండో వ్యక్తితో నీకు సమ దృష్టి లేదు బుద్ది జివి అయిన మానవుడిన్ని సృష్టించిన నువ్వే ఏ బావలకు నోచుకోని ,అనుబవాలకు స్పదించని మూగజివీ జంతువుని సృష్టించావు.మనుష్యులలో మహానియలు తో పాటు  మారణహోమంకలిగించే వారిని పట్టించావు.

సాదుజంతువులతో పాటు క్రూరమృగాలని ఇ లోకంలో మస్లేట్టట్టు చేసావు.నీ సృష్టిలోఎన్నో వైరుధ్యాలు. ఎన్నోవైవిధ్యాలు...అందుకే నా ఇంట్లో కి నీ ప్రవేశం నిషిద్ధం అన్నాడు .ఆ అతిది జీవులు వారి కర్మామానుసారం వివిధ రూపాలుగా ,రకాలుగా జన్మిస్తారు . అదే సృష్టి రహస్యం అని నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ అతిధి ఎవరో కాదు సాక్షాత్తు బగవంతుడు రెండో వ్యక్తిని ఆదరించాడు కదా ఆ అతిది పేరే మృత్యువు.........

 ఇంతకీ ఇ కద లోని నీతి మృత్యువు నుంచి ఏ ప్రాణి తప్పించుకోలేదని చేదు నిజాన్ని తెలుసుకున్నారు ..........

ఒక రిషి అడవిలో తపస్సు చేసుకుంటూ వున్నాడు .పిల్లి వెంటబడటంతో ,ప్రాణ బయంతో పరుగెడుతున్నఒక ఎలుక ఒకటి కనిపించింది. ఆ రిషి కి ఎలుక ఫై జాలి కలిగింది దాన్ని రక్షించుకుందాం అని  ఎలుకను పిల్లి గా మార్చాడు

ఆ పిల్లి ని కుక్క తరిమింది ,ఆ రిషి దాన్ని కుక్క గా మార్చాడు ,అలా కుక్కగా మారిన ఎలుక స్వేచ్ఛగా అడవిలోతిరుగుతూ ఒక పులి కంట పడింది ..పులి దాని మిద దాడిచేయ్యబోయింది .రుషి ఎలుకను కాస్తా పులిగా మార్చేసాడు.

ఎలుక నుంచి పిల్లి గా ,పిల్లి నుంచి కుక్కగా చివరికి పులి రూపం దాల్చిన ఆ జివి తన ప్రాణం కాపాడిన రిషి మీదకుదూకబోయింది . అప్పుడు ఆ రిషి ఆ జంతువుకు ఎలుక గా బతికేందుకు మాత్రమే అర్హత వుందని యదాపూర్వనికి మార్చేసాడు

సేవ ,ప్రేమ ,త్యాగం ,వీటిద్వార మనకు లబించిన .మానవజన్మను సార్దకం చేసుకోకపోతే జంతువులుగా  జన్మించి   వెనక్కు వెళ్ళవలసి వస్తుంది అనేది  ఇ కద లోని నీతి

అయ్యబాబోయ్  నా కదలన్నీ చదివేయకండి .......

Wednesday 16 February 2011

పలుకే బంగారామాయరా.......

ఓ గుడ్డిబిక్షువు  రద్దీగా వున్న రోడ్డు పక్కన కూర్చుని ఆ దారిన వచ్చే పోయే వారిని యాచిస్తున్నాడు
అతడి పక్కనే తలక్రిందులుగా చేసిన టోపిలో దయగలవారు రుపాయీ ,అర్ధ రుపాయీ ,వేస్తూ వెళ్ళుతున్నారు బిక్షువు పక్కనే చిన్న పలక పై నేను గుడ్డి వాణ్ణి దయచేసి నాకు సహాయం చెయ్యండి అని వ్రాసి వుంది అటుగా వెళ్ళుతున్న ఓ వ్యక్తి బిక్షువు టోపిలో ఓ రుపాయీ నాణే౦ వేసి ఆ పక్కనే వున్న పలక తీసుకోని దాని మిద రెండు మూడు వాక్యాలుకొత్తగా  వ్రాసి దాన్ని అందరు చూసేలా అమర్చి వెళ్లి పోయాడు .

తానూ చేసిన పనికి పలితం ఎలా వుందో తెలుసుకోవాలని సాయంత్రం ఆ వ్యక్తి బిక్షువు దగర్రికి వెళ్ళాడు. ఆశ్చర్యంఆ టోపీ నిండా నాణాలే ఆ బిక్షువు ఆ వ్యక్తి రాకను గమనించి అయ్యా మీరు నాకు మధ్యానం సహాయం చేసి వెళ్ళినవ్యక్తివే కదా ! మీకు నాకు నా ధన్యవాదాలు నా పలక మీద ఏదో రాసినట్టు నేను గ్రహించాను మీరు వెళ్ళాక నాకు చాల మంది సాయం చేసారు ..మీరు పలక మీద ఏ రాసారో తెలుసుకోవచ్చా అన్ని ప్రాదేయపడ్డాడు.

అప్పుడు ఆ వ్యక్తి నవ్వి నువ్వేం వ్రాసావో నేను అదే రాసాను . కాకపోతే నేను కొంచెం మార్చి  రాసాను అంతే! అన్నాడు నేను గుడ్డి వాణ్ణి దయ చేసి సాయం చెయ్యండి అని నువ్వు రాసావు నేను దాన్ని మార్చి మహాత్మా !  ఈ రోజు ఎంతో అందమైనది .ఆ అందాన్ని ఆస్వాదించగల అదృష్టవంతులు మీరు నాకు అదృష్టం లేదు .నాకు దయచేసి సాయం చెయ్యండి అని రాసానంతే! అన్నాడు .నిజానికి గుడ్డివాడు వాక్యాలకు ఆ వ్యక్తి రాసిన వాక్యాలకు తేడా ఎమి లేదు రెండు ఆ బిక్షువు గుడ్డివాడినని చెబుతున్నాయి. కాని ఆ వ్యక్తి వాక్యాలే ప్రబావితంగా వున్నాయి.

దిన్ని బట్టి మనం మూడు విషయాలు గ్రహించవచ్చు.......................................
వున్నదాంతో తృప్తి పడండి మీకు వున్నది కూడ ఇతరులకు లేకపోవచ్చు ఇది మొదటిది  ఇక రెండొవది అర్హత కల్గిన వ్యక్తులకు ,అవసరంలో వున్న వారికి విలైనంతవరకు సాయం చెయ్యండి మూడోది ఏమిటంటే మీలో సృజనాత్మకత వుంటే బిన్నంగా ఆలోచించే ప్రయత్నం చేయగల్గితే ప్రతి పనిని అనుకున్న దాని కంటే  గొప్పగా పూర్తి చేయవచ్చు .

మనిషి కి బావవ్యక్తికరణ గొప్ప ఆస్తి  ఏం చెప్పాలనుకునే దానికన్నాఎలా చెప్పాలో తెలుసుకోవడంలోనే మనిషి విజ్ఞత దాగి వుంటుంది ప్రతి విషయాన్నీ ముక్కు సూటిగా చెప్పడంలో ప్రమాదం పొంచి వుండవచ్చు.....

ఇతరులను ఆకట్టుకునేలా వాక్పటిమను అలవరుచుకోవాలి .  అప్పుడే వాక్కు ఎవరికైన బూషణమవుతుంది.

మీరు దిన్ని చదివేసి ఇకనైనా జాగ్రత్తగా వుంటారని  ఏదో బాబు నాకు తెలిసింది మీ చెవున ఎసాను టాటా మరి తర్వాత టపా లో కలుద్దాం ...........

Tuesday 15 February 2011

పరహిత వ్రతం

లోకం లో మూడు రకాల మనుష్యులు వుంటారు .ఇ జీవితం పరుల మేలు కోరే వారు మొదటి రకం.
తన కోసమే అనేవారు రెండో రకం.జీవితం తనది తనకోసమే అనేవారు మోడో రకం.వీరిలో మొదటి కోవకు చెందినవారె వుత్తములు యోగులు మనులు వారు లోక కళ్యాణమే మహోన్నతసయం గా బావించి తమ జీవిత సర్వసం అంకితం చేసిన మహానుభావులు.కనుకనే నేడు మన బారత జాతి ఆధ్యాత్మిక  దశ వైపుదూసుకువెల్లుతుంది.

ఎంతటి ఆధ్యాత్మికాన౦దానుబుతిలో రసప్లావితులవతున్న మానవుడు నిరంతరం గుర్తుంచుకుని చెయ్యవలసినవ్రతం  ఒకేఒకటి  అది పరహిత వ్రతం అంటే ఇతరులకు వుపకారం చెయ్యడమే నిరంతర దిక్షగా పూని వర్డిల్లడం

నిజానికి పరోపకారం అనే శబ్దం చాల తేలికగా అనిపించినా  ఆ పదంలోని శక్తి మహిమ వర్ణనాతితం.తెల్లవారిమేల్కొన్నపట్టినుంచి మన దినచర్యలను,సంభాషణలను,ప్రవర్తనలను ,ఏమైనా పరిశిలించుకుంటున్నామా?మనం ఏం చేస్తున్నాం ? ఎవరికి కోసం చేస్తున్నాం ? ఏం మాట్లాడుతూన్నా౦  ? వీటికి సమాదానం ఒకటే  నా కోసం నా కుటుంబం  కోసం యెంత స్వార్దం! ఎంత హేయం !  ఇ సమాదానం తో సంతృప్తిపడుతూ శ్లేష్మం లోని ఈగలా కొట్టుమిట్టాడుతూ నిరర్ధకంగా జీవితం వేల్లబుచ్చడమేనా?

బగవంతుడు అందించిన   ఈ జీవన వరప్రసాదం పదిమంది కి అందాలి.పది మంది మన మాటల వల్ల  మన చర్యలవల్ల ఆనందపడాలి .సుకపడాలి.బదులు గా వారెమిస్తారు ,మనకేం చేస్తారన్న బావనకే మనసులో చోటు యీవ్వకూడదు.హితమన్నా ,వుపకారమన్నా అదే(వుపకారికి వుపకారం తో  పాటుఅపకారికి కుడా  వుపకారమేచెయ్యమని చెబుతున్నాయి శాస్త్రాలు.)

అంతటి విశాల హృదయం అలవరుచుకున్ననాడు మానవ జాతిలో హింసకుఅశాంతి కి తావే లేదు . పొరుగువారికి తోడ్పడటంలో సొంత లాబం కొంతెయినా మానుకుంటే కొంపలేముంటాయ్.
ఒక్క మాటసాయమో, పని సాయమో చేస్తే, ఎదుటి వ్యక్తి ముకం లో ఎంతటి అనందం తోనికిసలాడతాయో. అది చుస్తే మన జన్మ ధన్యంఅనిపించదు.ఆ ఆనందమే ఆరోగ్యాన్ని పెంచుతుంది .

90 సం  ఓ పండు వృద్దుడు ఓ మామిడి మొక్కను నాటుతుంటే పిల్లవాడు -తాతా ? ఇ మామిడి మొక్క పెదద్దియిపండ్లు ఇస్తే తినచ్చుని  ఆశతో  నాటుతున్నావా! అని అడిగితే తాత అన్నాడట మా తాత ముత్తాతలు వేసిన మొక్కలు వృక్షాలీ ఫలాలనిస్తే తృప్తిగా అరగించాను కదా అలాగే ఇ మొక్కలు నా కోసం కాదు నాయనా ! తరువాతితారాలు కోసం అన్నాడట .అటువంటి ఉపాకారబావం మనిషి నరనరాన జీర్ణించుకుని పోవాలి.

ఇతరులకు సహాయపడే తత్వం లేకపోతె మనం దేని నుంచి అయిన ఎవరినుంచి అయినా ఏరకంగా  మేలు పొందగలం.ఎంత డబ్బు వున్నా దానితో కొనలేనివి కూడ కొన్ని వున్నాయీ అది గమనించాలి .మనం మూడు వేళ్ళతో దానం చేస్తే అయిదు వేళ్ళతో తినగలం మనం ఎంత సంపాదించాము కాదు ఎలా సంపాదించాము అన్నదిముక్యం . ఎంత దాచిపెట్టాము కాదు ఎంత వితరణ చేసాము .ఎంత సెపూ వాడు నాకేం చేసాడని నేను చెయ్యాలి?అని  ప్రశ్నించడం మహా ముర్కత్వం.

నిజమైన వుపకారి తానూ ఇతరులకు చేసిన మేలును బహిరంగంగా ప్రకటి౦చుకోడు   .ఇదంతా చెప్పి ఏదో సహాయంకావాలని చెప్పినది కాదు ఏదో నాకు తెలిసిన మంచి మీతో పంచుకున్నాను .ఎదిఅయినా తప్పులు వుంటే మన్నించండి.
పరహిత వ్రతదిక్షాచరులకు అందే సుకశా౦తులు అందుకే అనుబవేక  వేద్యాలు ఆత్మ పరమాత్మలకు నిత్య నైవేద్యాలు.  


 .

Friday 11 February 2011

కప్ప కు వున్న బాధలు చూసారా.........

ఒక మడుగులో కప్ప ఒకటి ఒంటరిగా జీవించేది. ఒకరోజు దానికి తన జీవితం మీద విసుగు పుట్టింది. తన భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసుకోవాలనిపించింది. ఫోన్‌లో భవిష్యవాణి చెప్పే నంబరుకు ఫోన్ చేసింది.
 
‘‘రాబోయే రోజుల్లో మీకు ఏ దిగులూ ఉండదు. మీ సమస్యలన్నీ తీరిపోతాయి. అతి త్వరలో మీరు ఒక అందమైన అమ్మాయిని కలుసుకోబోతున్నారు. ఆమె మీ గురించి అన్నీ తెలుసుకోవాలని ఆసక్తి చూపుతుంది’’ అని అవతలి వైపు నుంచి వినిపించింది


కప్ప ఎంతో సంతోషపడిపోతూ ‘‘అవునా?! ఆ అమ్మాయి నన్ను ఎక్కడ కలుస్తుంది ? పార్టీలోనా ?’’ అని అడిగింది
.
.

‘‘ఉమెన్స్ కాలేజీ లాబ్‌లో’’ అవతలివైపు నుంచి నెమ్మదిగా వినిపించింది. 


Thursday 10 February 2011

జీడిపప్పు హల్వా తయారీ

ముందు గా మా అమ్మమ్మ వాళ్ల వూరు వేటపాలెం అక్కడ బాగా దొరికేవి జిడి కాయలు ,జిడి పప్ప్పు ముంత మామిడి కాయలు ,వేసవి లో వెళ్ళే వాళ్ళం తాటి ముంజలు ,అయేతే చెట్టు ఎక్కి కోసుకొని తినడమే బాగా సలిసు గా దొరికే జిడి పప్పు తో హల్వా ఎలా చెయ్యా లో చెబ్తాను
.
జీడిపప్పు                     =  2 కప్పులు 
నెయ్యి                          =  2 చెంచాలు 
బాదాం పలుకులు         =  2 కప్పులు 
పంచదార                     =  2 కప్పులు 
కుంకుమ పువ్వు          =   కొద్దిగా
పాలు                           =  1లీటరు
ఎలాచి                          =  కొంచెం  



ముందుగా జీడిపప్పు ని   ఒక గంట సేపు నానా పెట్టాలి  తర్వాత  మెత్తగా రుబ్బి పెట్టు కోవాలి
.  
ఒక లీటరు పాలు పొయ్యి మిద పెట్టి  బాగా మరిగేటప్పుడు మనం యిప్పటికి సిద్దంగా వుంచుకున్న జీడిపప్పుముద్దను వేసి బాగా కలుపుకోవాలి
 .
పాలలో వుడికే జీడిపప్పు కు పంచదారను కలుపుకోవాలి.యీ మిశ్రమాన్ని బాగా పాకం కొద్దిగా గట్టి పడేదాకా వుడికించాలి  అలా ముద్దగా అయీన తర్వాత మంచి కలర్ యాలకుల పొడి వేసి దించుకుంటే  దానిఫై అలంకరణ కోసం కుంకుమ పువ్వు మరియు బాదాం రేకుల్ని చల్లాలి .అప్పుడు జీడిపప్పు హల్వా రెడీ  .

Tuesday 8 February 2011

చామంతి టీ తాగుదాం చలో చలో

చెలిబుగ్గ చామంతి మొగ్గ’ అని ఆలపించాడో భావకవి. ‘బంతీ చామంతి ముద్దాడుకున్నాయిలే’ అని పాడుకున్నాడు మరో సినీకవి. పూలలో ఎన్ని రకాలున్నా చామంతి పువ్వు ప్రత్యేకతే వేరు. అది వెదజల్లే సువాసన, విరజిమ్మే వర్ణ సోయగం అందర్నీ ఇట్టే ఆకర్షిస్తాయి.


 ఒక సర్వే ప్రకారం ప్రపంచంలో గులాబీ కంటే కూడా చామంతి పువ్వును ఇష్టపడే వారి సంఖ్య అధికమట!. ఎన్నో ఔషద గుణాలు కలిగిన చామంతి పువ్వుకు పుట్టినిల్లు మన ఆసియా ఖండమేనంటే ఆశ్చర్యం అవసరం లేదు. అయితే యూరోప్‌ను చుట్టి దక్షిణ అమెరికాలో అడుగుపెట్టి కానీ చామంతి మన లోగిళ్ళకు చేరలేదు!


 ఒక అంచనాప్రకారం క్రీస్తుపూర్వం 15వ శతాబ్దిలో చామంతి చైనాలో రేకు విచ్చుకుంది. ఆ తర్వాత ఎనిమిదవ శతాబ్దంలో జపానుకు వలస వెళ్ళింది ,అక్కడ చక్రవర్తి ఇ పువ్వును రాజముద్ర కి గా  వాడి నట్లు  చారిత్రక ఆధారాలున్నాయి అ తర్వాత గ్రీకు దేశం నుంచి యూరప్ అంతటా విస్తరించింది.



 

 
తెలుగువారికి ఈ పువ్వు ‘చామంతి’గా పరిచయం. అయితే పాశ్చాత్యులు ఈ పువ్వును పలు రకాల నామదేయం పేర్లతో పిలుస్తుంటారు. 

 మందార జాతికి చెందిన ఈ మొక్క సాధారణంగా 50 నుంచి 150 సెంటీమీటర్ల పొడవు పెరుగుతుంది.
 ఆకులు- భుజాలు కలిగి ఒంపులు తిరిగి వుంటాయి. నలిపి చూస్తే చక్కటి సువాసన తెలుస్తుంది

 చామంతి ఆకులను జలుబు వంటి వ్యాధుల నివారణకు వినియోగిస్తూ వుంటారు. ఇక పువ్వులు వివిధ పరిమాణాల్లో వుంటాయి

 తొడిమ కొనలు మొదలుకొని సింధూర తిలకంలా దట్టంగా పరుచుకునే చిన్నచిన్న రేకుల్లోనే అందమంతా దాగి వుంటుంది

 మన పల్లెలో చిట్టి చామంతి మొదలుకొని అరచేతిలో ఇమిడిపోయే చామంతులను చూస్తుంటాం. కొద్దిపాటి పవ్వులతోనే ఒత్తుగా, గుత్తుగా తయారయ్యే పూదండను అలంకరించుకుని ఆనందంగా తిరిగే ఆడపిల్లలు ఇప్పటికీ కనిపిస్తుంటారు

 అలాగే చామంతి పూలతో ఆసియాలో పలు దేశాలలో తీయటి పానీయం తయారు చేసుకుని సేవిస్తారు. దీనినే చాలా మటుకు ‘చామంతి టీ’గా వ్యవహరిస్తున్నారు

 చామంతి పువ్వులను నీళ్ళలో వేసి మరిగించి కొద్దిగా పంచదార వేస్తే సాధారణమైన టీ తయారవుతుంది. కొన్ని హంగులు చేరిస్తే చక్కటి పానీయంగా మారుతుంది

 ఈ చక్కటి మొక్కలు పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచుతాయని ‘నాసా’ శాస్తవ్రేత్తల పరిశోధనలో వెల్లడయ్యింది. అలాగే కీటకాలు, దోమలు వంటివి రాకండా నిరోధంగా పనిచేస్తాయనీ నిర్థారించారు 

 ఇంకా అనేక రకాల ఔషదాల్లో చామంతిని విరివిగా వినియోగిస్తున్నారు. హెచ్‌ఐవీ-1 నియంత్రణ కోసం తయారు చేసే డ్రగ్స్‌లో చామంతిని వినియోగిస్తారు.

  
 

Monday 7 February 2011

ఆహా ఎమి రుచి ...........

నా టపా చదివె వాళ్ల కి ఒక విన్నపం దిన్ని చూసి వదిలెయ్య కూడదు . చేసుకొని మరి తినాలండోయ్ మా వూరి జున్ను పాలు ,గడ్డ జున్ను గురించి కొంచెం చెబ్తా మరి ....................(.)

ఎప్పుడు మా వూరు వెళ్ళిన జున్ను తినకుండా వుండను అదియేమిటోనండి టైం కి దొరుకుతాయి. మాకు తెలిసినవాళ్ళు కొంచెం కూడ నీళ్ళు పోయకుండా పోస్తారు పాపం నాకోసమే ఏమో  పాలు తెచ్చిన వెంటనే అమ్మ చెయ్యడం మొదలు పెడుతుంది

.ఇక చూడండి చేసిన తర్వాత తినడానికి స్పూన్ తో కట్ చెయ్య లేనంత గట్టి గా వుంటుంది కొంచెం తింటే చాలు యెంత మదురమో మరి........................ మీకు చెప్తాను ఎలా చెయ్యాలో చూడండి మరి



 పాలు               =1/2 liter
మిరియాల పొడి = 1/2 tea spoon
బెల్లం                 =1/4kg
ఇలాచి               =1/2 tea spoon


ముందుగా ఒక గిన్నెలో పచ్చి పాలల్లో నేను చెప్పినవి అన్ని వేసి ఒక బాణలి లో నీళ్ళు పోసి అ గిన్నెని బాణలి లో పెట్టిపొయ్యి మిద పెట్టండీ

 ఒక పావు గంట తర్వాత దించండి.ఇక జున్ను రెడీ బాబోయ్ నాకు కూడ ఓ వంటకం వచ్చేసింది. ఇలాంటి వన్ని యెంత డబ్బులు పెట్టినాదొరకవు కదండి. మీరు అనుకోవచ్చు ఎందుకు దొరకదు  యీ కాలంలో దొరకని వస్తువులేదు  అని , కాని అది అదే ఇది ఇదే .అందుకే పుట్టిన వూరిని మరవకండి

పల్లెల్లో దొరికనప్పుడు అనిపిస్తుంది అబ్బా రోజు ఎమి తింటాం  అని .కాని దాని విలువ దొరకనప్పుడు తెలుస్తుంది  ఏమిటో యే సుత్తి అనుకోకుండా చేసుకుని తినండి చేసుకోవడం రాకపోతే నేను చేసినప్పుడు పంపుతాను లెండి

 

శేషాచల ఆశేషపర్వతం చూశారా

రోజు వారిని  అలసి సోలసిన శరీరం సేదతిరాలంటే కాశ్మీర్ కొ కన్యాకుమారి కో పరిగెత్తనక్కర్లేదు బిజీ జీవితాలనుంచి విముక్తి కోసం కాస్తంత ,బక్తి నిచ్చే కారు చవక గమ్యం మన రాష్టంలో  కూడ వుంది  అది ఏమిటా  బాబు అంటారా దాని దగ్గరికె వస్తున్నాను

















బిజీ బిజీ లైఫ్ తో బోర్ కొట్టేస్తుంది  కదు.కాస్తంత  సాహాసం తో పాటు వుల్లాసాన్ని పొందాలనుకోవాలంటే
అందాల అడవిలో విహారం ఆహ్లదం రీచార్జ్ అన్ని కల బోసిన శేషాచల శికరాలలో సామాన్యుల కంట పడని ఆకాశాన్నీ అంటే ఏంతో అపురూపమైన  అందాలను చుడాలంటే తలకోన వెళ్ళాలి అండి(;)

ఇందులో ఒక ట్విస్ట్ కూడాను   మా  స్నేహితులు చేబితెను అది కూడ మి చెవున వేద్దాం అనిపిస్తుంది. అది ఏమిటో కాదండి. తలకోనకి అసలు అ పేరుఎలావచ్చింది తెలుసుకోవాలి కదా మరి ముందు గా అ వెంకన్న స్వామి తనకువచ్చిన కాసులని లెక్క పెట్టుకుంటూ అలసి సోలసి తలవల్చాడట

శేషాచల  శికరాల సమీపంలో సాహసికుల అలసటను కూడ అడవి అందాలూ పొగోడతాయీ అంటే నమ్మరు ఇక సెలయేటి గలగలలు కూడ సేదతిరుస్తాయి అడవి వుడత పండు తింటూ పలకరించింది .జలపాతం కనిపించగానే అందరికి జలకాలాడలనిపిస్తుంది. ఎంతసేపు ఇ జల్లులో తడిసినా తనివితీరలేదనడం కాయం.

.తలకోన ఆకుపచ్చని అడవిలో ఆకులా ఒదగిపోయింది.కొండపైనుంచి కనిపించే అడవి అందాలూ అదరహో అనిపిస్తున్నాయి.అందమైన అడవిలో అద్బుత  దృశ్యాలు ఆవిష్కరమైయ్యాయి.కీటకాలు కూడ కనివిందు చేసాయి


.
అక్కడ పారే నీళ్ళు ఏంత పరిశుబ్రంగా వుంటాయంటే ప్యూరిఫైడ్ వాటర్ కూడ సరిపోవండి .కింగ్ లాంటి కంగు మడుగులో అందరు జలకలడాలిసిందే  ప్రకృతి లో  కలిసిపోయేటట్టు కనిపించే జలపాతం ఇది.యీ మడుగు కి  ఒకస్పెషల్  వుంది అది ఏమిటో అండి ఎప్పుడు చూసినా యే కాలంలో కూడ ఎండని మడగు ఇది .యెంత చెప్పిన  తరగనికూన తలకోన .

Tuesday 1 February 2011

స్నేహితులు - చిలిపి పనులు - 1



ముందుగా నా బ్లాగులోకి ఆహ్వానం :).

హమ్మయ్యా, నే కూడా ఓ బ్లాగేట్టేసా!  మొన్నెవరో బ్లాగులు రాసేవాళ్ళు ఎక్కువ, సదివే వాళ్లు తక్కువ అన్నారు. అయినా తప్పదు కదండీ మన భావాలు పంచుకోవాలంటే పక్కోల్ల బ్లాగులు అద్దెకు తీసుకోవాలంటే కష్టం గదా! గదీ సంగతి  :)

సరే మరి, ఇల్లలగ్గానే  పండగా కాదు అన్నట్లు  మరి ఏదో ఒకటి ఊసు రాయాలి, అది మీకు నచ్చాలి.. అప్పుడే బ్లాగ్పండగ.  టపా టైటిల్ చెప్పినట్లు చిన్నప్పుడు నేను, నా స్నేహితులు చేసిన చిలిపి.. అంటే సరదా పనులండీ బాబు కొద్దిగా రాసేద్దాం అని మొత్తమ్మీద నిర్ణయించేసుకున్నా! .

టియ్యో౦. .టియ్యొ౦..టుయ్యోమ్... టుయ్యోమ్

ఏంటి అదేదో చైనా తిట్టు అనుకున్నారా, కాదండీ అది గతంలోకి వెళ్లేముందు వచ్చే తెలుగు సినిమా సంగీతపు ముక్క అన్నమాట.  సాగరసంగమంలో డైరట్రు చెప్పినట్టు టపాలోకి కాదు.. నా గతంలోకి చూడండి.. మీ బాల్యం గుర్తుకు రావాలి ఆయ్ :)


అసలు విషయం ఏమిటి అంటె  మేము ఫ్రెండ్స్ ముగురం వుండే వాళ్ళం. పేరు పేరునా చెప్పాలంటే విద్య, ధనలక్షి మరియు నేను. మాది నిడమానూరు అనే చిన్న పల్లెటూరు, పచ్చని పొలాలు, ఏటి గట్లు.

అక్కడ మేం బాల్య౦లో చేసిన కొన్ని చిలిపి పనులు.




వర్షం ఎప్పుడెప్పుడు  వస్తుందా, ఏటి గట్టు ఎప్పుడు ని౦డుతుందా అని ఎదురు చూస్తుండ గా ఒక రోజు రానే వచ్చింది. కానీ సినిమాలో వచ్చినట్లు త్రిషా మటుకు రాలేదండీ ప్చ్ :) . సరేలే మాకు వర్షం కావాలి. ఇక మేము ఎంజాయ్ చేసిన తీరు ఏటో సెబితే కాదండీ చూడాలి.సప్ట్టా మీదకు నీళ్ళు రానే వచ్చాయి. అందులోనూ టైం చుస్తే సాయంకాలం ఆరు గంటల సమయం. పెద్ద పెద్ద వురుములు గాలి తో కూడుకున్న శబ్దాల్ని కూడ లెక్కచేయకుండా నిళ్ళలోనికి దిగాం ఈత ఎవ్వరికీ రాకపోయినా. కాని అ రోజు నీళ్ళలో ఎంజాయ్ చేస్తూ ఒకరిని ఒకరు పట్టుకుంటూ మధ్య మధ్యలో తప్పటడుగులు వేస్తూ అలలతో(?) ఆడుకుంటూ  ఎంజాయ్ చేస్తూంటే చెన్నై బీచ్ కూడ సరిపోదండి బాబు . అసలా ఆన౦దం అనుభవించాలి అంతే!.

ఇక మా సొంత వూరిలోని చెట్టులు పుట్టల్లు అన్ని మావేనండీ. జామ , నేరేడు, మామిడి, ఈత, రేగి, బొప్పాయి, బత్తాయి, చింత ఇంకా హ్మ్.. తాటిముంజలు. ఇ౦కా సజ్జ, కంది కంకులు , పిల్లి  పెసర్లు... ఓహ్

ఇక పండు కావాలంటే చెట్టు ఎక్కడమే, అది జామైనా జాన్తానై ,చింతైనా చింతా నహీ :). ఏదైమైనా కష్టపడి కోసుకుతింటే వచ్చే ఆ మజా నే వేరు కదూ! ఇంకా మజా రావాలంటే  పాఠశాలలో పాఠ౦ బదులు ఆ కోసుకోచ్చిన వాటిని నెమరేయడం. పాఠశాల-నెమరు  అంటే ఇంకొన్ని కొంటె పనులు గురుతొచ్చే..

పాఠశాల కి వెళ్ళేప్పుడు మనం వురుకుంటామా వెళ్ళుతూ వెళ్ళుతూ ఐస్ అబ్బీ కాడ ఐస్ తీసుకోని చీకుతూ, జుర్రుతూ  తినడం.  ఆ తర్వాత గొట్టాల ప్యాకెట్ కొనడం. దానిని బయట తింటే సరిపోతుందిగా కాదు క్లాసురూంలో తింటే మజా యిక చూడండి చిలిపి బాచ్ది లాస్ట్ బెంచ్ అండి.టీచర్ గారు పాఠం మొదలెట్టాక  గొట్టాలని కరకరా తినడ౦ , టీచర్ ఎవర్రా అంటే గప్..చుప్ సాంబార్ బుడ్డి అనడం.. మళ్ళీ షరా మామూలు.. అదో రుచి.. అరుచి ఎరగనిది  ఆ వయసు.

టుయ్యోమ్... టుయ్యోమ్..టియ్యో౦. .టియ్యొ౦..

పైన మూజిక్ ముక్క అర్థం అయిందిగా.. ఇప్పడు  గతం నుండి టపాలోకి చూడండి :). అవి ఇప్పటికి ముచ్చటలు. మరి మీ బాల్యపు సరదాలు ఎలా గడిచేవో ఇక్కడో ముక్కేయండం మరిచిపోకండే! ఆ చేత్తోనే నా తొలి టపామీద మీ అభిప్రాయాల మొటిక్కాయలు :)