Wednesday 9 March 2011

లండన్ లోని ఆసుపత్రులూ .....

ఆహా ! కడుపు రగిలిపోతుంది దూరపు కొండలు నునుపు అంటే ఇదేనేమో మొన్నటి కి మొన్న ఎవరో రాసారు విదేశాలలో  వుండాల లేక స్వదేశంలో వుండాల అని ,,ఎప్పుడైనా సాటి మనిషి కి ఆరోగ్యం బాగొలేనప్పుడు చూడలేని డాక్టర్  నా దృష్టిలో డాక్టరే  కాదు, అప్పుడు కుడా రూల్స్ పాటించే సొసైటి వీరిది(లండన్ ) ,అయినా  దయచేసిచేబుతున్నాను ఇక్కడ(లండన్ ) వుండే తెలుగు వాళ్ళకు విన్నపం ఏదైనా ప్రాబ్లం  వుంటే ఇండియా కి వెళ్లి చూపించండి .ఇక్కడ మాత్రం వద్దు ఎందుకో చెబ్తాను, నేను ప్రాబ్లం వుండి ఆసుపత్రి కి వెళ్ళాను మాకు దగ్గరగా వుండే క్లినిక్ కి మొదట వెళ్ళాను ,అక్కడ GP registeration వుంటే చూస్తాము అన్నారు ,సరే తర్వాత వేరే క్లినిక్  వెళ్ళితే అక్కడ కూడ అదే పరిస్తితి ఎదురైంది ,కాని మీరు అనుకోవచ్చు  ప్రాబ్లం ఏంటి  registeration చేయించుకుంటే చూస్తారు కదా అని మీరుఅనుకోవచ్చు.అసలు GP REGISTERATION  అంటే ఏమిటో చెబుతాను మనం లండన్ లో ఆసుపత్రికి వెళ్ళాలి అంటే ముందుగా రిజిస్టర్ చేయించుకోవాలి అప్పుడు మనం అర్హులుగా గుర్తిస్తారు.మీకు  మా ఫ్రెండ్ కి జరిగిన  సంఘటన గురించి చెప్పాలి.


ఇక్కడ మా ఫ్రెండ్ కి ఫీవర్ గా వుంటే చూపించుకోవడానికి ఆసుపత్రి కి వెళ్ళింది. తనకి GP వుంది మొదటి రోజు BP  చూసారు అది చూడడానికి ఒకరోజు మొత్తం పట్టింది. తనకి అప్పటికే ఫీవర్ బాగా ఎక్కువైంది ,వాళ్ళు చెప్పిన విషయంఏమిటి అంటే రిపోర్ట్స్  ఇంటికి వస్తాయి ,తర్వాత ప్రాసెస్ జరుగుతుంది అని చెప్పారు అవి వచ్చేసరికి ఒక వారం పట్టింది యిలోపల తనకి జ్వరం కుడా తగ్గిపోయింది. ఇది ఇలా వుండాగా నేను వెళ్ళాను ఆసుపత్రికి  అక్కడ మొదట రిసెప్షన్ లో ప్రాబ్లం ఏంటి అని అడిగారూ ,అక్కడ చెప్పాను ,తర్వాత రెండు గంటల సమయం తర్వాత లోపలికి వెళ్ళాను అక్కడ డాక్టర్ ప్రాబ్లం చెప్పించుకుని టెస్ట్లు లు చేసారు డాక్టర్ ఒక స్లిప్ మీద ప్రాబ్లం రాసి అక్కడే వేరే డిపార్టుమెంటు కి పంపించాను.

 అక్కడికి వెళ్ళమని చెప్పాడు. సరే అక్కడ ఒక రెండు గంటల సమయం పట్టింది ,వుదయం నుంచి ఎమి తినకుండా వెళ్ళాను ,మన ఇండియా లో లాగా త్వరగా అయిపోతుంది(ఆసుపత్రి పని ), అని అంతా రివర్స్ అయింది.అయ్యో అక్కడ నుంచి కునికిపాట్లు పడుతూ చిన్నగా ఒక హాల్ లో కూర్చో పెట్టారు ,అక్కడ కూడ ఒక గంట సమయం తర్వాత లోపలికి వెళ్ళాను నా తో పాటు మా ఫ్రెండ్ కూడ వచ్చింది .ఇద్దరం లోపలికి వెళ్ళాము ,అక్కడ డాక్టర్ నన్ను ప్రాబ్లెం అడిగి పేపర్ మీద రాసుకున్నాడు ,నన్ను  ముందు ఒక డాక్టర్ చూసాడు ,టెస్ట్లు అన్ని చేసాడు ,మళ్ళి యితను అన్ని  అడుగుతాడు.
.
ముందు యిచ్చిన పేపర్ మీద అన్ని వున్నాయి  చూడచ్చు కదా చూడరు అసలే నాకు ఒకపక్క ఆకలి ,నీరసం ,ఎన్నిసార్లు చెబుతూ౦  తీర చెప్పాక నాకు విషయం ఏమిటో చెప్తాడు అంటే చెప్పకుండా మా ఫ్రెండ్ తో సొల్లు వేసుకుంటాడు. అక్కడ ఒక ౨౦ నిముషాలు దండగ తీర డాక్టర్ తేల్చింది ఏమిటంటే తను కూడ పేపర్ మీద ప్రాబ్లం రాసి మళ్ళి లేడి డాక్టర్ దగ్గరకి పంపారు ,అప్పటికి టైం 3.00 యిక మళ్ళి యివిడ టెస్ట్లు లు మళ్ళి మొదటి నుంచి స్టార్ట్ చెయ్యడం నాకు ఓపికలేదు ఇంక అంటే మా ఫ్రెండ్ ఏమో సుమో.. ఇ వక్కసారి చెప్పవే సరే గాని అని  నేను... తీరా అంతా అయ్యాకా ఇవిడ కంప్యూటర్ ముందు ఒక నాలుగు గంటలు కూర్చుని తర్వాత వైటింగ్ హల్ కి వచ్చి అయ్యో సారీబాగా లేట్ అయింది అనుకుంటాను అని......

 ఆవిడ నా మొహం మీద టాబ్లెట్స్ పడేసింది ,తీర ఒక  రోజు అంతా గడిపితే  ఆవిడ చివరి తీర్పు ఏమిటంటే మీరు వేరే ఆసుపత్రిలో చూపించుకోండి.ప్రాబ్లెం ఏమిటో తెలియలేదు నేను నాకు తెలిసన మందులు ఇస్తాను అని  చెప్పింది దానితో రోజు అంతా ముగిసింది, అంచేత నేను చెప్పదలుచుకున్నది ఎమిటిటంటే   మన తెలుగువాళ్ళు ఎవరైనా లండన్ లో వుంటే  హెల్త్ ప్రాబ్లెమ్స్ వస్తే  ఇండియా కి వెళ్లి చూపించు కోండి అయన ఇక్కడి ఆసుపత్రి చూడడానికి అందంగా వున్నా అది కల్పితం  మాత్రమే లోపల అసలు విషయం వుండదు.

అబ్బా నేను అనుకున్నాను, మొదట ఆసుపత్రిని చూసి ,చాల బాగా చూస్తారు అని ,కాని మన పెద్దలు చెప్పింది నిజం(పైన చెప్పిన సామెత )  బ్రహ్మనందం మన్మధుడు సినిమా లో చెప్పాడు గా అయ్యో ఇది పారిస్ అండి ఇండియాని   కొన్నియుగాలు ముందుకు తిప్పితే అది పారిస్ ఇక్కడ అన్ని లేటెస్ట్ గా వుంటాయి ,ఏమో మరి అన్ని వుంటాయేమో చూడడానికి మాత్రమే పనికి రావడానికి కాదు , ఎందుకు ఎడవను,పై పై మెరుగులకు మోసపోకండి.

ఒకమంచిమాట,పలకరింపు,అభిమానం ఇవ్వన్ని కావాలంటే మన ఇండియాకి  వెళ్ళాల్సిందే ఎమిటోనండి నాఅనుభవాన్ని మీతో పంచుకున్నాను ,మన వాళ్ళు కదా అని చెప్పాను ఇక మీ ఇష్టం అసలు మేము మొదట మెయిన్ ఎంట్రన్స్ దగ్గర అడిగాం మేడం అర్జెంటు గా డాక్టర్ కి కలవాలి అని మా ఫ్రెండ్ అడిగితే ,నో మేడం ఎంత అర్జెంటు అయిన విత్ అవుట్ రిజిస్టర్ మేము చూడం అని చెప్పింది ,(మాకు  GP  లేదండి) కాని ఆవిడ కనిసం పక్కనే వాక్ ఇన్ సెంటర్ వుంది చూపించు కోండి అని కుడా చెప్పలేదు ,అంత హినాతి హీనం జనం పరిస్తితి  అదే మన ఇండియా లో అయేతే ఎప్పటికి జరగదు ఎంతైనా I LOVE MY INDIA  somuch మీరు ఎమి అనుకుంటున్నారో త్వరగా చెప్పేయండి ......
  ,

14 comments:

  1. అయ్యో పాపం!

    ReplyDelete
  2. అవునండి నిజమే మీరు బాగా చెప్పారు ...
    ఎంతైనా ఇండియా ఇండియానే సూపర్బ్ ...

    ReplyDelete
  3. sumalata garu
    peruki vedesalu kani maata palakarimpu yedi
    baga rasaru

    ReplyDelete
  4. Sumalatha garu,

    Meeru cheppina salahaanu nenu gatha vaarame paatinchaanu. Hyd velli choopinchukovalsi vachindi

    ReplyDelete
  5. @padmarpita garu
    స్పదించినందుకు ధన్యవాదాలు

    ReplyDelete
  6. anonymoous 1 garu
    thanks andi
    anonymous 2 garu
    thanks andi my advise ni patimchinamduku

    ReplyDelete
  7. హ్మ్! కొంచెం బాధాకరమైన పరిస్థితే! ఇక్కడా అంతే! ఐతే మరీ మీరు చెప్పినంత రూడ్ గా ఉండరు! కొంచెం బెటర్ :) పాపం మీరు,మీ స్నేహితురాలు! ఎప్పటికైనా మన ఇండియా మన ఇండియానే! అంతే! :)

    ReplyDelete
  8. ammayya mallee tapa vachchesindaa I can write then

    Sumalata gaaru,

    your experience is probably an exception rather than a rule as doctors the in UK are trained about communication with patients from the 3rd year of mbbs onwards. I know because I have been teaching them communication skills since the last 4 years (I am a psychiatrist working here)

    yes, there are delays in seeing patients because there are exceptional quality targets here. You don't know the kind of quality these people aim for....each and every nurse/doctor is trained not to use the same needle again if they have tried to get a vain (for blood for ex) but could not and they come out of the vein.....they have really lot of quality standards.

    other fact is they are very limited in human resources and give everything free in terms of healthcare...you do know, I suppose that everything from a broken toe nail to the most costliest medicine for any cancer is given free here....I know, because I receive 8000gbp worth of medicines free every month from NHS here.

    There are lot of private hospitals where you will be seen instantly (ex BUPA) but i guess you would not want to go there right? I knwo I would not as it costs min of 100£ for consultation :-)

    anyayamandi
    jajikhaanalo velli sarigga choodaledu ani mottam hyderabad hospitals ide paristhiti ani annattu undi mee tapaa.

    eastham i.e east of london, is the most deprived part of london. you can compare it to the poorest of poor old hyderabad How can you compare the newham general hopsital near eastham/in east london to central london hospitals? London hospitals are london hospitals, antenandi....gata enimid ellugaa untunnaa ikkada...patientgaa kooda anubhavame...UK hospitals can not be compared to indian hospitals....both systems are different, standards are different, service offered is different ....everything is different.


    anavasaramga bhayapadakandi ikkadi hospitalsku.....we do our best to serve you....please keep fith in us.

    ReplyDelete
  9. and sumalata garu,

    I CAN TELL YOU GUARANTEEDLY THAT NO LIFE IS LOST IN UK BECAUSE OF DELAYS IN HOSPITALS.

    meeru annare, mundu oka receptionist laanti vallu mimmalni emiti problem ani adigaarani....they are called triage nurses.....triaging ante edi mukhyam first edi deal cheyyaali ani decide cheyyatam....obviosuly if you had been kept waiting that means that the problem you went with was low down the order of patient problems they ahd in terms of "danger". yes you would have suffered pain/discomfort/distress but you were never in danger................THAT IS THE PROMISE OF NHS.

    they will keep me waiting in a&e waiting room as a patient, even after knowing that I was a doctor who used to come to offer my specialist advice there but will not bend rules...which is for safety.....I have waited for 4 hours in a&es for about 3 times in this country.

    Obviously it will take time to get used to a system I agree and am sure you will one day be praising this system.

    Sincerely,
    Dr B Raghavendra

    ReplyDelete
  10. కరెక్టు ! ఆరోగ్య సమస్య వల్ల ఓ రెండు నిముషాలు లేట్ అయితే, అప్పాయింట్ మెంట్ రద్దు చేస్తారు NHS Surgery లో కూడా ! అప్పుడు ఇంకో రోజుకి అపాయింటుమెంటు తీసుకోవాలి. అదృష్టవశాత్తూ మా GP, Dr.Agarwal, పక్కా గుజరాతీ ! ఎపుడైనా అక్కడికి వాకినే ! హిందీ లోనే మాటామంతీ. కాపోతే, NHS డాక్టర్లు మా వైజాగ్ లోని KGH డౌన్ లోని ప్రైవేటు ప్రాక్టీసు చేసే KGS Specialist డాక్టర్ల ముందు తీసికట్టే ! India is good in this area. At least we can run into a private surgery and shell money, to get well.

    ReplyDelete
  11. @indu garu థాంక్స్ అండి స్పందించినందుకు
    నేను అలా చెప్పడంలో కొంచెం బాధగా వుండచ్చేమో కాని నేను ఆ రోజుఅనుభవించిన తీరు నన్ను చాలా బాధ పెట్టింది

    ReplyDelete
  12. @సుజాత గారు
    మీరు అదృష్టవంతులు తెలిసిన GP వున్నారు కాబట్టి మేము చాలా సేపువెయిట్ చేసాము కాని ఫలితం దక్కలేదు.
    బాగా చెప్పారు NHS గురించి ధన్యవాదాలు అండి.

    ReplyDelete
  13. అవును సుజాతగారు నిజం గానే అదృష్టవంతులు.. తెలిసిన వారుంటే నిజంగానే.
    ఇదే లండనులో, ఇదే వైద్యశాలలో నాకు జరిగిన అనుభవం

    నా సహఉద్యోగిని భారతదేశంనుంచి మొన్న నవంబర్ నెలాఖర్లో వచ్చింది. వచ్చిన రెండు వారాల తర్వాత తను చాలా బలహీనంగా, నీరసంగా ఉండటం చూసి ఏమైందని అడిగా. తనకి అసమతుల్య పీరియడ్స్ సమస్య ఉందని, అదే పనిగా బ్లీడింగ్ అవుతుందని అయితే అది భారత్లో మందులతో తగ్గేదని, ఆ మందులు ఇక్కడ ఎంతవాడినా పనిచేయకుండా వారంనుంచి బ్లీడింగ్ ఎక్కువైందని చెప్పుకుంది. వెంటనే నేను ఇక్కడి వైద్యుడ్ని ఎందుకు కలలేదని గట్టిగా అడిగి తర్వాతి రోజు మాకు దగ్గర్లో ఉన్న క్లినిక్కి వెళ్ళాం. వాళ్ళు మేం ఇది అర్జెంటు ప్రాబ్లం అన్నా ఏమాత్రం పట్టించుకోకుడా general practitioner or GP అనుమతి(రిజిస్ట్రేషన్) లేకుండా చూడమని నిర్దాక్షిణ్యంగా చెప్పారు. పోనీ ఇది అర్జెంట్, ఇప్పడు రిజిస్ట్రేషన్ చేయించుకుంటాం అంటే ఆ రిజిస్ట్రేషన్ తంతు జరిపే నర్సులు సెలవల్లో ఉన్నారు, జనవరిలో రండి అని చెప్పారు. అంటే అప్పటివరకు మనిషి ఉండాలో పోవాలో మరి! ఇట్లా రెండుమూడు క్లినిక్కులకి తిరిగిన తర్వాత చివరికి ఓ హోటలాయన సలహామీద ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చాము. ఇహ మొదలయింది తంతు చూడండి.. ఎంత సరదాగా(?) ఉంటుందో!

    వైద్యశాల కి వచ్చిన గంటకి మొదటి లేవల్ చెక్-అప్ కి పిలుపు
    ౧.మొదటి లేవల్ చెక్-అప్

    సమస్య ఏంటి, ఎప్పటినుంచి అని అడిగారు, తను పాపం ఓపికలేక పోయినా ఇది అని చెప్పి కొద్దిగా ఎమర్జెన్సీ అన్నట్లుకూడా చెప్పాం. సరే వాళ్ళు అది మెడికల్ రిపోర్ట్ మీద రాసుకుని యూరిన్ టెస్ట్, బ్లడ్ టెస్ట్ (అసలే బ్లడ్డు పోయి నీరసం అని ఓ పక్క వాపోతుంటే!) చేశాడు. ఆ తర్వాత సమస్య తనకి అర్థం కావట్లేదని సెక౦డ్ లెవల్ చెక్-అప్ అవసరమని వేరే వాళ్ళ దగ్గరికి పంపాడు.

    మొదటి లేవల్ చెక్-అప్ అయిన రెండు గంటలకి రెండవ లెవల్ చెక్-అప్కి పిలుపు

    ౨.రెండవ లెవల్ చెక్-అప్
    ఇప్పడు సెక౦డ్ లెవల్ చెక్-అప్ అన్నమాట! మళ్ళీ ఇక్కడా అవే ప్రశ్నలు..
    ఏంటి సమస్య, ఎప్పటినుంచి అని? మొదటి లేవల్ చెక్-అప్ నుంచి వచ్చిన రిపోర్ట్ చూస్తేగా! పక్కోల్లతో సొల్లు కబుర్లు వేసుకుంటుంది. సరే, ఈ సారి నేను చెప్పా సమస్య ఏంటో! ఓ అలానా, అయితే యూరిన్ టెస్ట్, బ్లడ్ టెస్ట్ చేయాలి అని మళ్ళీ చేయించింది. రెండు పెద్ద ట్యూబ్ నిండా బ్లడ్ తీసుకుంది. తీసుకుంటే తీసుకుంది, సమస్యకి పరిష్కార౦ చెబితే బావుండు అని మేమనుకుంటుంటే వాళ్ళు నింపాదిగా సమస్య అర్థం కావట్లేదు, ఇది గైనో(గైనకాలజిస్టు) చూడాలి. మీరు అక్కడికి వెళ్ళండి అని పంపించారు. సరే తప్పదు కదా, అక్కడికి వెళ్ళాం.

    సెకెండ్ లేవల్ చెక్-అప్ అయిన మూడు గంటలకి రెండవ మెయిన్ చెక్-అప్కి పిలుపు

    ౩.మెయిన్ చెక్-అప్
    ఇప్పుడు గైనమ్మ అన్నమాట. ఏదో నవల్లో తెగలీనమై ఉంది. మేం ఏదో ఆమెను డిస్టర్బ్ చేసినట్టు మొహమెట్టి ఏంటి సమస్య? ఎప్పటినుంచి అని పాచిపళ్ళ పాట పాడింది. ఇంతకు ముందు చెక్ చేసినవాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ చూస్తే మేం చెప్పేదానికన్నా ఇంకా క్లియర్గా అర్థం అవుతుంది కదా. అదిలేదు. సరే ఇది అని చెప్పా౦. మళ్ళీ మొదలు.. యూరిన్ టెస్ట్, బ్లడ్ టెస్ట్ చేయాలని చెప్పింది. ఇహ మా ఇద్దరికీ కోపం వచ్చింది. కొద్దిగా తమాయించుకొని ఇప్పటికే రెండు సార్లు ఆ టెస్టులు ఆ చేసారు అని గట్టిగా చెప్పం. గైనమ్మ తత్తరపడుతూ ఓ అలానా అని అప్పుడు రిపోర్ట్ చూస్తూ బ్లడ్ ఎక్కువ కారట్లేదుగా ఎందుకు అంత బాధ(వర్రీ) అని ఓ ముక్క అనేసింది (అంటే ఎంత కారితే వర్రీ అవ్వాలో మరి!). ఆ తర్వాత ఆ రిపోర్ట్ పదిసార్లు అటూ ఇటూ తిరగేసి నలుగురింకి ఫోన్లు చేసి(హెల్ప్ కోసమేమో!) చివరికి ఒక పది టాబ్లెట్ల పాక్ చేతిలో పెట్టి, ఇక్కడ స్టాక్ లేదు ఇంకా అవసరమైతే బయటకోనుక్కో అని ఎంచక్కా చెప్పింది. అది సరే అసలు సమస్య ఏంటి అని నాలుగు సార్లు అడిగితె ఓ విసుగు నవ్వు నవ్వి ఇచ్చిన టాబ్లెట్లు కేవల౦ టెంపరరీఅని GP రిజిస్ట్రేషన్ త్వరగా చేయించుకుని, ప్రైవేట్ క్లీనిక్ లో చూపించుకోండి అని సలహా ఇచ్చింది.

    అద్గది విషయ౦! ఇదో విషవలయం అని తెలిసింది. ఇదేదో ప్రభుత్వాసుపత్రులూ, ప్రైవేటు క్లినిక్లు కలిసి ఆడుతున్న నాటకమని!.

    భారత్ లో కనీసం డబ్బు ఖర్చు పెడితే మ౦చి వైద్యం దొరుక్కుద్ది.. ఇక్కడా అది కూడా కష్టమేలా ఉంది! నిజానిక్క్కడ "వైద్యరంగ౦" మాంచి వ్యాపారరంగం ప్రపంచంలో లానే.. ప్రజల జీవితంతో ఆడుకోవటం అదీ చట్టప్రకారం!. ఇక్కడి వైద్యులు ప్రభుత్వం నుంచి పొందే సదుపాయాలూ, సొంత సంపాదన,నెలసరి వేతనాలు కల్లుచేది'రెట్లు' ఉంటాయి.

    ReplyDelete
  14. :-)

    A very valid point made by Rajeshji and Sumalatagaru as well,

    అవును పాడిందే పాడరా అన్న అత్న్టు మాత్రం ఇక్కడ నిజం ఒప్పుకుని తీరాల్సిందే.

    కాకపొతే ప్రాణం పోతుంది అంటే మాత్రం ఒప్పుకోను......yes we will have distress sitting and waiting for so many hours as the first level described by rajeshgaru is what is called as triaging.....and though it sounds very cruel.....yes, the case was deemed low priority by the first level consultation by evidence based methods.....తప్పదు

    overall గా సొసైటీలో ఉండే జనాభా మొత్తానికి అత్యుత్తమ వైద్య సేవ ఫ్రీగా అందించటం మూలాన అలాటి పరిస్థితి. అవును చాలా వెయిటింగ్ చెయ్యాలి ఆసుపత్రులలో. అవును ఆసుపత్రులలో జీపీ రిజిస్ట్రేషన్ లేనిదే నిర్దాక్షిణ్యంగా పంపించేస్తాము except in emergencies where you go to A&E. Otherwise the system would be overwhelmed as every body would come to hospitals bypassing the gps who are supposed to provide the the primary health care.

    As a person who went to India to just get an MRI (అవును నాకు ఉన్న నడుం నొప్పికి వాళ్ళు ఏమీ లేదు అని క్లీనికల్గా చూసి చెపితే...స్పైనల్ సర్జన్ చూసి చెప్పాక కూడా...నా పర్సనల సాటిస్ఫాక్షన్ కోసం ఇండియా వెళ్ళి ఏం ఆర్ ఐ చేయిన్చుకోచ్చాను.....రిపోర్ట్లో వాళ్ళు చెప్పిన ప్రకారమే ఏమీ లేదు...but it was those days when everyone from india that i knew was having spinal/brain TB so I was scared) I know how it hurts when I can afford the health care costs but can not get it fast enough.

    అప్పుడు తెలిసింది ఇక్కడ వాళ్ళ evidence based మెడిసిన్ రూల్స్ విలువ. ప్రతీ దానికీ వీళ్ళు కనక పేషెంట్స్ కోరినట్టు investigations రాయటం, ప్రతీ దానికి వెంటనే స్పెషలిస్ట్లకు రిఫర్ చెయ్యటం అనేది చేస్తే వీళ్ళు కావాలనుకుంటున్న క్వాలిటీ కేర్ ఇక్కడ ప్రొవైడ్ చెయ్యలేరు. అది మాత్రం నూటికి నూరుపాళ్ళ నిజం.

    ఇక్కడ బూపా లాటి ప్రైవేట్ క్లీనిక్స్ చాలా ఉన్నాయి. గంట కన్సల్తేశంకు వంద వందన్నర చార్జ్ చేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసి పంపిస్తారు. బయట రిసెప్షన్ హాల్లో ఒక అయిదు నిమిషాలు వైయిటింగ్ ఉంటుందేమో. ఎంచక్కా కాఫీ మెషీన్ కూడా ఉంటుంది. ఒక్క లేవలాఫ్ కన్సల్టేశానే.......అఫర్డ్ చెయ్యగలిగితే అలాటి చోట చూపించుకోవటమే బెటర్ అనుకుంటా మన దేశానికి ఫ్లైట్ టికెట్ అయ్యే ఖర్చులో మూడు కన్సల్టేశన్స్ అయిపోతాయి.

    కాని అఫర్డ్ చేసుకోలేని కుటుంబాలు మాత్రం తప్పదు.....ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలోనే పని జరిపించుకోవాలి. అవును మేము నాలుగు గంటలు వెయిట్ చెయ్యాల్సోస్తుంది...తప్పదు కదా మాకు....ఒక్కటే మాకు నమ్మకం....వరల్డ్ స్టాండర్డ్ వైద్య సేవ మాత్రం దొరుకుతుంది.

    finally rajeshgaaru, same london, same hospital annaaru....so i presume you are talking about newham general again...am I right? cheppanu kadandi మన ఓల్డ్ సిటీలో ఉండే చిన్న ఆసుపత్రి is not representative of hyderabad's healthcare setup/standards అలాగే nehham hospital or for that matter any hospital in east london is not reprsentative of london's health care set up....those isntitute of excellence వేరే ఉన్నాయి లెండి.

    ఆ ఒక్కటి మాత్రం నిజం....ఎక్కడికెళ్ళినా ఈ ఓల్డ్ సిటీ, న్యూ సిటీ డివైడ్ కనపడుతూనే ఉంటుంది....these class divisions do not go away whatever city we go to. ఆ ఈస్ట్ లండన్లో ఉండటం మన ఖర్మ అంతే.

    ఇక ఇక్కడ నేను డిఫెండ్ చెయ్యటం ఆపేస్తాను ఎందుకంటే నాది over all system wide view అయిపోతుంది ఎందుకంటే నేనీ సిస్టంలో భాగస్వామిని.........కాని ఈ టపా ఒక అనారోగ్యంతో బాధ పడే మనిషి తనకు కలిగిన అసంతృప్తిని పంచుకునే టపా....this is a personal upclose and micro view of this health care system......both are valid, true but will never be able to meet/converge....so no point in trying further.

    సుమలతగారు, రాజేష్ గారు.........hope there won't be any next time but if at all there is, hope we can exceed your expectations.....we try our best to help you.

    Best Wishes.

    ReplyDelete