Showing posts with label చిలిపి పనులు. Show all posts
Showing posts with label చిలిపి పనులు. Show all posts

Tuesday, 1 February 2011

స్నేహితులు - చిలిపి పనులు - 1



ముందుగా నా బ్లాగులోకి ఆహ్వానం :).

హమ్మయ్యా, నే కూడా ఓ బ్లాగేట్టేసా!  మొన్నెవరో బ్లాగులు రాసేవాళ్ళు ఎక్కువ, సదివే వాళ్లు తక్కువ అన్నారు. అయినా తప్పదు కదండీ మన భావాలు పంచుకోవాలంటే పక్కోల్ల బ్లాగులు అద్దెకు తీసుకోవాలంటే కష్టం గదా! గదీ సంగతి  :)

సరే మరి, ఇల్లలగ్గానే  పండగా కాదు అన్నట్లు  మరి ఏదో ఒకటి ఊసు రాయాలి, అది మీకు నచ్చాలి.. అప్పుడే బ్లాగ్పండగ.  టపా టైటిల్ చెప్పినట్లు చిన్నప్పుడు నేను, నా స్నేహితులు చేసిన చిలిపి.. అంటే సరదా పనులండీ బాబు కొద్దిగా రాసేద్దాం అని మొత్తమ్మీద నిర్ణయించేసుకున్నా! .

టియ్యో౦. .టియ్యొ౦..టుయ్యోమ్... టుయ్యోమ్

ఏంటి అదేదో చైనా తిట్టు అనుకున్నారా, కాదండీ అది గతంలోకి వెళ్లేముందు వచ్చే తెలుగు సినిమా సంగీతపు ముక్క అన్నమాట.  సాగరసంగమంలో డైరట్రు చెప్పినట్టు టపాలోకి కాదు.. నా గతంలోకి చూడండి.. మీ బాల్యం గుర్తుకు రావాలి ఆయ్ :)


అసలు విషయం ఏమిటి అంటె  మేము ఫ్రెండ్స్ ముగురం వుండే వాళ్ళం. పేరు పేరునా చెప్పాలంటే విద్య, ధనలక్షి మరియు నేను. మాది నిడమానూరు అనే చిన్న పల్లెటూరు, పచ్చని పొలాలు, ఏటి గట్లు.

అక్కడ మేం బాల్య౦లో చేసిన కొన్ని చిలిపి పనులు.




వర్షం ఎప్పుడెప్పుడు  వస్తుందా, ఏటి గట్టు ఎప్పుడు ని౦డుతుందా అని ఎదురు చూస్తుండ గా ఒక రోజు రానే వచ్చింది. కానీ సినిమాలో వచ్చినట్లు త్రిషా మటుకు రాలేదండీ ప్చ్ :) . సరేలే మాకు వర్షం కావాలి. ఇక మేము ఎంజాయ్ చేసిన తీరు ఏటో సెబితే కాదండీ చూడాలి.సప్ట్టా మీదకు నీళ్ళు రానే వచ్చాయి. అందులోనూ టైం చుస్తే సాయంకాలం ఆరు గంటల సమయం. పెద్ద పెద్ద వురుములు గాలి తో కూడుకున్న శబ్దాల్ని కూడ లెక్కచేయకుండా నిళ్ళలోనికి దిగాం ఈత ఎవ్వరికీ రాకపోయినా. కాని అ రోజు నీళ్ళలో ఎంజాయ్ చేస్తూ ఒకరిని ఒకరు పట్టుకుంటూ మధ్య మధ్యలో తప్పటడుగులు వేస్తూ అలలతో(?) ఆడుకుంటూ  ఎంజాయ్ చేస్తూంటే చెన్నై బీచ్ కూడ సరిపోదండి బాబు . అసలా ఆన౦దం అనుభవించాలి అంతే!.

ఇక మా సొంత వూరిలోని చెట్టులు పుట్టల్లు అన్ని మావేనండీ. జామ , నేరేడు, మామిడి, ఈత, రేగి, బొప్పాయి, బత్తాయి, చింత ఇంకా హ్మ్.. తాటిముంజలు. ఇ౦కా సజ్జ, కంది కంకులు , పిల్లి  పెసర్లు... ఓహ్

ఇక పండు కావాలంటే చెట్టు ఎక్కడమే, అది జామైనా జాన్తానై ,చింతైనా చింతా నహీ :). ఏదైమైనా కష్టపడి కోసుకుతింటే వచ్చే ఆ మజా నే వేరు కదూ! ఇంకా మజా రావాలంటే  పాఠశాలలో పాఠ౦ బదులు ఆ కోసుకోచ్చిన వాటిని నెమరేయడం. పాఠశాల-నెమరు  అంటే ఇంకొన్ని కొంటె పనులు గురుతొచ్చే..

పాఠశాల కి వెళ్ళేప్పుడు మనం వురుకుంటామా వెళ్ళుతూ వెళ్ళుతూ ఐస్ అబ్బీ కాడ ఐస్ తీసుకోని చీకుతూ, జుర్రుతూ  తినడం.  ఆ తర్వాత గొట్టాల ప్యాకెట్ కొనడం. దానిని బయట తింటే సరిపోతుందిగా కాదు క్లాసురూంలో తింటే మజా యిక చూడండి చిలిపి బాచ్ది లాస్ట్ బెంచ్ అండి.టీచర్ గారు పాఠం మొదలెట్టాక  గొట్టాలని కరకరా తినడ౦ , టీచర్ ఎవర్రా అంటే గప్..చుప్ సాంబార్ బుడ్డి అనడం.. మళ్ళీ షరా మామూలు.. అదో రుచి.. అరుచి ఎరగనిది  ఆ వయసు.

టుయ్యోమ్... టుయ్యోమ్..టియ్యో౦. .టియ్యొ౦..

పైన మూజిక్ ముక్క అర్థం అయిందిగా.. ఇప్పడు  గతం నుండి టపాలోకి చూడండి :). అవి ఇప్పటికి ముచ్చటలు. మరి మీ బాల్యపు సరదాలు ఎలా గడిచేవో ఇక్కడో ముక్కేయండం మరిచిపోకండే! ఆ చేత్తోనే నా తొలి టపామీద మీ అభిప్రాయాల మొటిక్కాయలు :)