Tuesday 1 February 2011

స్నేహితులు - చిలిపి పనులు - 1



ముందుగా నా బ్లాగులోకి ఆహ్వానం :).

హమ్మయ్యా, నే కూడా ఓ బ్లాగేట్టేసా!  మొన్నెవరో బ్లాగులు రాసేవాళ్ళు ఎక్కువ, సదివే వాళ్లు తక్కువ అన్నారు. అయినా తప్పదు కదండీ మన భావాలు పంచుకోవాలంటే పక్కోల్ల బ్లాగులు అద్దెకు తీసుకోవాలంటే కష్టం గదా! గదీ సంగతి  :)

సరే మరి, ఇల్లలగ్గానే  పండగా కాదు అన్నట్లు  మరి ఏదో ఒకటి ఊసు రాయాలి, అది మీకు నచ్చాలి.. అప్పుడే బ్లాగ్పండగ.  టపా టైటిల్ చెప్పినట్లు చిన్నప్పుడు నేను, నా స్నేహితులు చేసిన చిలిపి.. అంటే సరదా పనులండీ బాబు కొద్దిగా రాసేద్దాం అని మొత్తమ్మీద నిర్ణయించేసుకున్నా! .

టియ్యో౦. .టియ్యొ౦..టుయ్యోమ్... టుయ్యోమ్

ఏంటి అదేదో చైనా తిట్టు అనుకున్నారా, కాదండీ అది గతంలోకి వెళ్లేముందు వచ్చే తెలుగు సినిమా సంగీతపు ముక్క అన్నమాట.  సాగరసంగమంలో డైరట్రు చెప్పినట్టు టపాలోకి కాదు.. నా గతంలోకి చూడండి.. మీ బాల్యం గుర్తుకు రావాలి ఆయ్ :)


అసలు విషయం ఏమిటి అంటె  మేము ఫ్రెండ్స్ ముగురం వుండే వాళ్ళం. పేరు పేరునా చెప్పాలంటే విద్య, ధనలక్షి మరియు నేను. మాది నిడమానూరు అనే చిన్న పల్లెటూరు, పచ్చని పొలాలు, ఏటి గట్లు.

అక్కడ మేం బాల్య౦లో చేసిన కొన్ని చిలిపి పనులు.




వర్షం ఎప్పుడెప్పుడు  వస్తుందా, ఏటి గట్టు ఎప్పుడు ని౦డుతుందా అని ఎదురు చూస్తుండ గా ఒక రోజు రానే వచ్చింది. కానీ సినిమాలో వచ్చినట్లు త్రిషా మటుకు రాలేదండీ ప్చ్ :) . సరేలే మాకు వర్షం కావాలి. ఇక మేము ఎంజాయ్ చేసిన తీరు ఏటో సెబితే కాదండీ చూడాలి.సప్ట్టా మీదకు నీళ్ళు రానే వచ్చాయి. అందులోనూ టైం చుస్తే సాయంకాలం ఆరు గంటల సమయం. పెద్ద పెద్ద వురుములు గాలి తో కూడుకున్న శబ్దాల్ని కూడ లెక్కచేయకుండా నిళ్ళలోనికి దిగాం ఈత ఎవ్వరికీ రాకపోయినా. కాని అ రోజు నీళ్ళలో ఎంజాయ్ చేస్తూ ఒకరిని ఒకరు పట్టుకుంటూ మధ్య మధ్యలో తప్పటడుగులు వేస్తూ అలలతో(?) ఆడుకుంటూ  ఎంజాయ్ చేస్తూంటే చెన్నై బీచ్ కూడ సరిపోదండి బాబు . అసలా ఆన౦దం అనుభవించాలి అంతే!.

ఇక మా సొంత వూరిలోని చెట్టులు పుట్టల్లు అన్ని మావేనండీ. జామ , నేరేడు, మామిడి, ఈత, రేగి, బొప్పాయి, బత్తాయి, చింత ఇంకా హ్మ్.. తాటిముంజలు. ఇ౦కా సజ్జ, కంది కంకులు , పిల్లి  పెసర్లు... ఓహ్

ఇక పండు కావాలంటే చెట్టు ఎక్కడమే, అది జామైనా జాన్తానై ,చింతైనా చింతా నహీ :). ఏదైమైనా కష్టపడి కోసుకుతింటే వచ్చే ఆ మజా నే వేరు కదూ! ఇంకా మజా రావాలంటే  పాఠశాలలో పాఠ౦ బదులు ఆ కోసుకోచ్చిన వాటిని నెమరేయడం. పాఠశాల-నెమరు  అంటే ఇంకొన్ని కొంటె పనులు గురుతొచ్చే..

పాఠశాల కి వెళ్ళేప్పుడు మనం వురుకుంటామా వెళ్ళుతూ వెళ్ళుతూ ఐస్ అబ్బీ కాడ ఐస్ తీసుకోని చీకుతూ, జుర్రుతూ  తినడం.  ఆ తర్వాత గొట్టాల ప్యాకెట్ కొనడం. దానిని బయట తింటే సరిపోతుందిగా కాదు క్లాసురూంలో తింటే మజా యిక చూడండి చిలిపి బాచ్ది లాస్ట్ బెంచ్ అండి.టీచర్ గారు పాఠం మొదలెట్టాక  గొట్టాలని కరకరా తినడ౦ , టీచర్ ఎవర్రా అంటే గప్..చుప్ సాంబార్ బుడ్డి అనడం.. మళ్ళీ షరా మామూలు.. అదో రుచి.. అరుచి ఎరగనిది  ఆ వయసు.

టుయ్యోమ్... టుయ్యోమ్..టియ్యో౦. .టియ్యొ౦..

పైన మూజిక్ ముక్క అర్థం అయిందిగా.. ఇప్పడు  గతం నుండి టపాలోకి చూడండి :). అవి ఇప్పటికి ముచ్చటలు. మరి మీ బాల్యపు సరదాలు ఎలా గడిచేవో ఇక్కడో ముక్కేయండం మరిచిపోకండే! ఆ చేత్తోనే నా తొలి టపామీద మీ అభిప్రాయాల మొటిక్కాయలు :)

21 comments:

  1. welcome to blog world , vijayawada daggara kada aa vuru(nidamanuru)

    ReplyDelete
  2. sumalatha said ...
    na blog ni visit chesinaduku thanks andi
    aa vuru ongole daggara andi.

    ReplyDelete
  3. వెసవిలో మా ఉరికి వెళ్ళినప్పుడు అంతే..బాగా తొటలు..కాలువలూ..పొలాలూ..తిరిగెయ్యడమే పని

    ReplyDelete
  4. @అది జామైనా జాన్తానై ,చింతైనా చింతా నహీ :).
    :)) హహ్హ! chill out.

    ReplyDelete
  5. sumalatha said...
    rajesh garu
    thanks for visiting my blog

    ReplyDelete
  6. ఫస్ట్ ఫస్టు బొమ్మ బాగుంది...నెక్స్ట్ నెక్స్టు టపా బాగుంది..చిన్నప్పటి కబుర్లు ఎన్ని చెప్పినా తరగవు...సుమలత గారు స్వాగతం అండీ.

    ReplyDelete
  7. sumalatha said...
    ennela garu
    thanks for visiting my blog yedo kasepu sardaaga;()

    ReplyDelete
  8. మొదటి మూడు లైనులు సూపర్ ..టపా చదవలేదు ..:)

    happy blogging

    ReplyDelete
  9. స్వాగతం సుమలతగారూ.
    చాలా బాగా రాశారు.
    నిడమానూరు అనగానే యేటిగట్టు ఎక్కడ ఉందా అనుకున్నాను మాది విజయవాడ దగ్గర నిడమానూరులెండి.

    ReplyDelete
  10. సుమలతగారు బాగున్నాయి మీ చిలిపి,చిన్నతనపు కబుర్లు.

    ReplyDelete
  11. లత గారు థాంక్స్ అండి నా బ్లాగ్ నీ విజిట్ చేసినందుకు ఒంగోలు దగ్గర
    నిడమానూరు

    ReplyDelete
  12. రాదిక(నాని) గారు థాంక్స్ అండి నా బ్లాగ్ నీ విజిట్ చేసినందుకు

    ReplyDelete
  13. థాంక్స్ అండి కష్టపడి కామెంట్ ఎట్టినందుకు

    ReplyDelete
  14. ఇప్పుడు కష్టపడట౦..ఏ౦ట౦డి..పైన చూడ౦డి :)

    ReplyDelete
  15. కాలిగా వున్నట్టున్నారు నా పోస్టలన్నీ చదవండి

    ReplyDelete
  16. బావు౦టే చదువుతాను :)

    ReplyDelete
  17. www.telugupustakalu.com

    ndariki teliyaparachandi.... pustaka priyulaki idi oka vindu

    ReplyDelete
  18. థాంక్స్ భానుగారు నా బ్లాగ్ ని విజిట్ చేసినందుకు

    ReplyDelete