Thursday 17 February 2011

అద్దెకొంపలో -ఆత్మారాముడు

ఒక అర్దరాత్రి సమయంలో యిద్దరు అతిధులు ఆశ్రమం కోసం ఓ ఇంటి తలుపు తట్టారు .ఇంటి యజమాని తలుపు తీసిఆ యిద్దరి వివరాలు అడిగాడు .వారి గురించి తెలుసుకుని ఒకరికే ఆశ్రమం యిచాడ్డు.

రెండో వ్యక్తితో నీకు సమ దృష్టి లేదు బుద్ది జివి అయిన మానవుడిన్ని సృష్టించిన నువ్వే ఏ బావలకు నోచుకోని ,అనుబవాలకు స్పదించని మూగజివీ జంతువుని సృష్టించావు.మనుష్యులలో మహానియలు తో పాటు  మారణహోమంకలిగించే వారిని పట్టించావు.

సాదుజంతువులతో పాటు క్రూరమృగాలని ఇ లోకంలో మస్లేట్టట్టు చేసావు.నీ సృష్టిలోఎన్నో వైరుధ్యాలు. ఎన్నోవైవిధ్యాలు...అందుకే నా ఇంట్లో కి నీ ప్రవేశం నిషిద్ధం అన్నాడు .ఆ అతిది జీవులు వారి కర్మామానుసారం వివిధ రూపాలుగా ,రకాలుగా జన్మిస్తారు . అదే సృష్టి రహస్యం అని నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ అతిధి ఎవరో కాదు సాక్షాత్తు బగవంతుడు రెండో వ్యక్తిని ఆదరించాడు కదా ఆ అతిది పేరే మృత్యువు.........

 ఇంతకీ ఇ కద లోని నీతి మృత్యువు నుంచి ఏ ప్రాణి తప్పించుకోలేదని చేదు నిజాన్ని తెలుసుకున్నారు ..........

ఒక రిషి అడవిలో తపస్సు చేసుకుంటూ వున్నాడు .పిల్లి వెంటబడటంతో ,ప్రాణ బయంతో పరుగెడుతున్నఒక ఎలుక ఒకటి కనిపించింది. ఆ రిషి కి ఎలుక ఫై జాలి కలిగింది దాన్ని రక్షించుకుందాం అని  ఎలుకను పిల్లి గా మార్చాడు

ఆ పిల్లి ని కుక్క తరిమింది ,ఆ రిషి దాన్ని కుక్క గా మార్చాడు ,అలా కుక్కగా మారిన ఎలుక స్వేచ్ఛగా అడవిలోతిరుగుతూ ఒక పులి కంట పడింది ..పులి దాని మిద దాడిచేయ్యబోయింది .రుషి ఎలుకను కాస్తా పులిగా మార్చేసాడు.

ఎలుక నుంచి పిల్లి గా ,పిల్లి నుంచి కుక్కగా చివరికి పులి రూపం దాల్చిన ఆ జివి తన ప్రాణం కాపాడిన రిషి మీదకుదూకబోయింది . అప్పుడు ఆ రిషి ఆ జంతువుకు ఎలుక గా బతికేందుకు మాత్రమే అర్హత వుందని యదాపూర్వనికి మార్చేసాడు

సేవ ,ప్రేమ ,త్యాగం ,వీటిద్వార మనకు లబించిన .మానవజన్మను సార్దకం చేసుకోకపోతే జంతువులుగా  జన్మించి   వెనక్కు వెళ్ళవలసి వస్తుంది అనేది  ఇ కద లోని నీతి

అయ్యబాబోయ్  నా కదలన్నీ చదివేయకండి .......

5 comments:

  1. అలాగేనండి అస్సలు చదవట్లేదు మీకథలు ః)

    ReplyDelete
  2. ధన్యవదాలండి కేశవగారు ,శుబకరుడుగారు ......

    ReplyDelete
  3. బాగున్నాయండీ కథలు , మీరు చదవద్దన్నారు కాబట్టి అన్నీ చదివేసా

    ReplyDelete
  4. ధన్యవాదాలు ఎన్నెలగారు

    ReplyDelete