నా టపా చదివె వాళ్ల కి ఒక విన్నపం దిన్ని చూసి వదిలెయ్య కూడదు . చేసుకొని మరి తినాలండోయ్ మా వూరి జున్ను పాలు ,గడ్డ జున్ను గురించి కొంచెం చెబ్తా మరి ....................(.)
ఎప్పుడు మా వూరు వెళ్ళిన జున్ను తినకుండా వుండను అదియేమిటోనండి టైం కి దొరుకుతాయి. మాకు తెలిసినవాళ్ళు కొంచెం కూడ నీళ్ళు పోయకుండా పోస్తారు పాపం నాకోసమే ఏమో పాలు తెచ్చిన వెంటనే అమ్మ చెయ్యడం మొదలు పెడుతుంది
.ఇక చూడండి చేసిన తర్వాత తినడానికి స్పూన్ తో కట్ చెయ్య లేనంత గట్టి గా వుంటుంది కొంచెం తింటే చాలు యెంత మదురమో మరి........................ మీకు చెప్తాను ఎలా చెయ్యాలో చూడండి మరి
పాలు =1/2 liter
మిరియాల పొడి = 1/2 tea spoon
బెల్లం =1/4kg
ఇలాచి =1/2 tea spoon
ముందుగా ఒక గిన్నెలో పచ్చి పాలల్లో నేను చెప్పినవి అన్ని వేసి ఒక బాణలి లో నీళ్ళు పోసి అ గిన్నెని బాణలి లో పెట్టిపొయ్యి మిద పెట్టండీ
ఒక పావు గంట తర్వాత దించండి.ఇక జున్ను రెడీ బాబోయ్ నాకు కూడ ఓ వంటకం వచ్చేసింది. ఇలాంటి వన్ని యెంత డబ్బులు పెట్టినాదొరకవు కదండి. మీరు అనుకోవచ్చు ఎందుకు దొరకదు యీ కాలంలో దొరకని వస్తువులేదు అని , కాని అది అదే ఇది ఇదే .అందుకే పుట్టిన వూరిని మరవకండి
పల్లెల్లో దొరికనప్పుడు అనిపిస్తుంది అబ్బా రోజు ఎమి తింటాం అని .కాని దాని విలువ దొరకనప్పుడు తెలుస్తుంది ఏమిటో యే సుత్తి అనుకోకుండా చేసుకుని తినండి చేసుకోవడం రాకపోతే నేను చేసినప్పుడు పంపుతాను లెండి
అశాంతి నిలయం
2 days ago
Wow photo maatram noorooripotondi.Chesukuni tinalani undi kani Junnu paalu anni chotlaa dorakavu kadandii :((
ReplyDelete-----పల్లెల్లో దొరికనప్పుడు అనిపిస్తుంది అబ్బా రోజు ఎమి తింటాం అని .కాని దాని విలువ దొరకనప్పుడు తెలుస్తుంది ఏమిటో యే సుత్తి అనుకోకుండా చేసుకుని తినండి చేసుకోవడం రాకపోతే నేను చేసినప్పుడు పంపుతాను లెండి
ReplyDelete-----
:-(( అవును..
సుమలత గారు
ReplyDeleteహ్మ్.. నూరూరించేసారు ఆ బొమ్మతో. ఇంకొద్దిగా విడమరిచి రాయండి ఎలా చేయాలో.. తొందరొద్దు సుమీ :)
యేంటో మీరు! అదేదో బజార్లో దొరికే వస్తువు లాగా, తెచ్చుకోండి, వండుకోండి, తినేయండీ అని వ్రాసారు...ఇక్కడ జున్ను మిల్క్ ..ఊహించండి!
ReplyDeleteయీ మధ్య చాలా బ్లాగుల్లో జున్ను పాల చర్చలు జరుగుతున్నాయి..దీన్ని మా నార్త్ అమెరికా తరఫున ఖండిస్తున్నాను అధ్యక్షా...మీరు ఇలా వ్రాయడం..మేమెమో అదేదో చయినా గాడ్డి వెతికి తెచ్చుకోడం..నాకేమీ నచ్చలే...
పర్లేదులే ఇ సారీకి ఇండియా నుంచి ఓగేసుకో అధ్యక్షా!
ReplyDelete