లోకం లో మూడు రకాల మనుష్యులు వుంటారు .ఇ జీవితం పరుల మేలు కోరే వారు మొదటి రకం.
తన కోసమే అనేవారు రెండో రకం.జీవితం తనది తనకోసమే అనేవారు మోడో రకం.వీరిలో మొదటి కోవకు చెందినవారె వుత్తములు యోగులు మనులు వారు లోక కళ్యాణమే మహోన్నతసయం గా బావించి తమ జీవిత సర్వసం అంకితం చేసిన మహానుభావులు.కనుకనే నేడు మన బారత జాతి ఆధ్యాత్మిక దశ వైపుదూసుకువెల్లుతుంది.
ఎంతటి ఆధ్యాత్మికాన౦దానుబుతిలో రసప్లావితులవతున్న మానవుడు నిరంతరం గుర్తుంచుకుని చెయ్యవలసినవ్రతం ఒకేఒకటి అది పరహిత వ్రతం అంటే ఇతరులకు వుపకారం చెయ్యడమే నిరంతర దిక్షగా పూని వర్డిల్లడం
నిజానికి పరోపకారం అనే శబ్దం చాల తేలికగా అనిపించినా ఆ పదంలోని శక్తి మహిమ వర్ణనాతితం.తెల్లవారిమేల్కొన్నపట్టినుంచి మన దినచర్యలను,సంభాషణలను,ప్రవర్తనలను ,ఏమైనా పరిశిలించుకుంటున్నామా?మనం ఏం చేస్తున్నాం ? ఎవరికి కోసం చేస్తున్నాం ? ఏం మాట్లాడుతూన్నా౦ ? వీటికి సమాదానం ఒకటే నా కోసం నా కుటుంబం కోసం యెంత స్వార్దం! ఎంత హేయం ! ఇ సమాదానం తో సంతృప్తిపడుతూ శ్లేష్మం లోని ఈగలా కొట్టుమిట్టాడుతూ నిరర్ధకంగా జీవితం వేల్లబుచ్చడమేనా?
బగవంతుడు అందించిన ఈ జీవన వరప్రసాదం పదిమంది కి అందాలి.పది మంది మన మాటల వల్ల మన చర్యలవల్ల ఆనందపడాలి .సుకపడాలి.బదులు గా వారెమిస్తారు ,మనకేం చేస్తారన్న బావనకే మనసులో చోటు యీవ్వకూడదు.హితమన్నా ,వుపకారమన్నా అదే(వుపకారికి వుపకారం తో పాటుఅపకారికి కుడా వుపకారమేచెయ్యమని చెబుతున్నాయి శాస్త్రాలు.)
అంతటి విశాల హృదయం అలవరుచుకున్ననాడు మానవ జాతిలో హింసకుఅశాంతి కి తావే లేదు . పొరుగువారికి తోడ్పడటంలో సొంత లాబం కొంతెయినా మానుకుంటే కొంపలేముంటాయ్.
ఒక్క మాటసాయమో, పని సాయమో చేస్తే, ఎదుటి వ్యక్తి ముకం లో ఎంతటి అనందం తోనికిసలాడతాయో. అది చుస్తే మన జన్మ ధన్యంఅనిపించదు.ఆ ఆనందమే ఆరోగ్యాన్ని పెంచుతుంది .
90 సం ఓ పండు వృద్దుడు ఓ మామిడి మొక్కను నాటుతుంటే పిల్లవాడు -తాతా ? ఇ మామిడి మొక్క పెదద్దియిపండ్లు ఇస్తే తినచ్చుని ఆశతో నాటుతున్నావా! అని అడిగితే తాత అన్నాడట మా తాత ముత్తాతలు వేసిన మొక్కలు వృక్షాలీ ఫలాలనిస్తే తృప్తిగా అరగించాను కదా అలాగే ఇ మొక్కలు నా కోసం కాదు నాయనా ! తరువాతితారాలు కోసం అన్నాడట .అటువంటి ఉపాకారబావం మనిషి నరనరాన జీర్ణించుకుని పోవాలి.
ఇతరులకు సహాయపడే తత్వం లేకపోతె మనం దేని నుంచి అయిన ఎవరినుంచి అయినా ఏరకంగా మేలు పొందగలం.ఎంత డబ్బు వున్నా దానితో కొనలేనివి కూడ కొన్ని వున్నాయీ అది గమనించాలి .మనం మూడు వేళ్ళతో దానం చేస్తే అయిదు వేళ్ళతో తినగలం మనం ఎంత సంపాదించాము కాదు ఎలా సంపాదించాము అన్నదిముక్యం . ఎంత దాచిపెట్టాము కాదు ఎంత వితరణ చేసాము .ఎంత సెపూ వాడు నాకేం చేసాడని నేను చెయ్యాలి?అని ప్రశ్నించడం మహా ముర్కత్వం.
నిజమైన వుపకారి తానూ ఇతరులకు చేసిన మేలును బహిరంగంగా ప్రకటి౦చుకోడు .ఇదంతా చెప్పి ఏదో సహాయంకావాలని చెప్పినది కాదు ఏదో నాకు తెలిసిన మంచి మీతో పంచుకున్నాను .ఎదిఅయినా తప్పులు వుంటే మన్నించండి.
పరహిత వ్రతదిక్షాచరులకు అందే సుకశా౦తులు అందుకే అనుబవేక వేద్యాలు ఆత్మ పరమాత్మలకు నిత్య నైవేద్యాలు.
.
అశాంతి నిలయం
8 hours ago
No comments:
Post a Comment