Tuesday 8 February 2011

చామంతి టీ తాగుదాం చలో చలో

చెలిబుగ్గ చామంతి మొగ్గ’ అని ఆలపించాడో భావకవి. ‘బంతీ చామంతి ముద్దాడుకున్నాయిలే’ అని పాడుకున్నాడు మరో సినీకవి. పూలలో ఎన్ని రకాలున్నా చామంతి పువ్వు ప్రత్యేకతే వేరు. అది వెదజల్లే సువాసన, విరజిమ్మే వర్ణ సోయగం అందర్నీ ఇట్టే ఆకర్షిస్తాయి.


 ఒక సర్వే ప్రకారం ప్రపంచంలో గులాబీ కంటే కూడా చామంతి పువ్వును ఇష్టపడే వారి సంఖ్య అధికమట!. ఎన్నో ఔషద గుణాలు కలిగిన చామంతి పువ్వుకు పుట్టినిల్లు మన ఆసియా ఖండమేనంటే ఆశ్చర్యం అవసరం లేదు. అయితే యూరోప్‌ను చుట్టి దక్షిణ అమెరికాలో అడుగుపెట్టి కానీ చామంతి మన లోగిళ్ళకు చేరలేదు!


 ఒక అంచనాప్రకారం క్రీస్తుపూర్వం 15వ శతాబ్దిలో చామంతి చైనాలో రేకు విచ్చుకుంది. ఆ తర్వాత ఎనిమిదవ శతాబ్దంలో జపానుకు వలస వెళ్ళింది ,అక్కడ చక్రవర్తి ఇ పువ్వును రాజముద్ర కి గా  వాడి నట్లు  చారిత్రక ఆధారాలున్నాయి అ తర్వాత గ్రీకు దేశం నుంచి యూరప్ అంతటా విస్తరించింది.



 

 
తెలుగువారికి ఈ పువ్వు ‘చామంతి’గా పరిచయం. అయితే పాశ్చాత్యులు ఈ పువ్వును పలు రకాల నామదేయం పేర్లతో పిలుస్తుంటారు. 

 మందార జాతికి చెందిన ఈ మొక్క సాధారణంగా 50 నుంచి 150 సెంటీమీటర్ల పొడవు పెరుగుతుంది.
 ఆకులు- భుజాలు కలిగి ఒంపులు తిరిగి వుంటాయి. నలిపి చూస్తే చక్కటి సువాసన తెలుస్తుంది

 చామంతి ఆకులను జలుబు వంటి వ్యాధుల నివారణకు వినియోగిస్తూ వుంటారు. ఇక పువ్వులు వివిధ పరిమాణాల్లో వుంటాయి

 తొడిమ కొనలు మొదలుకొని సింధూర తిలకంలా దట్టంగా పరుచుకునే చిన్నచిన్న రేకుల్లోనే అందమంతా దాగి వుంటుంది

 మన పల్లెలో చిట్టి చామంతి మొదలుకొని అరచేతిలో ఇమిడిపోయే చామంతులను చూస్తుంటాం. కొద్దిపాటి పవ్వులతోనే ఒత్తుగా, గుత్తుగా తయారయ్యే పూదండను అలంకరించుకుని ఆనందంగా తిరిగే ఆడపిల్లలు ఇప్పటికీ కనిపిస్తుంటారు

 అలాగే చామంతి పూలతో ఆసియాలో పలు దేశాలలో తీయటి పానీయం తయారు చేసుకుని సేవిస్తారు. దీనినే చాలా మటుకు ‘చామంతి టీ’గా వ్యవహరిస్తున్నారు

 చామంతి పువ్వులను నీళ్ళలో వేసి మరిగించి కొద్దిగా పంచదార వేస్తే సాధారణమైన టీ తయారవుతుంది. కొన్ని హంగులు చేరిస్తే చక్కటి పానీయంగా మారుతుంది

 ఈ చక్కటి మొక్కలు పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచుతాయని ‘నాసా’ శాస్తవ్రేత్తల పరిశోధనలో వెల్లడయ్యింది. అలాగే కీటకాలు, దోమలు వంటివి రాకండా నిరోధంగా పనిచేస్తాయనీ నిర్థారించారు 

 ఇంకా అనేక రకాల ఔషదాల్లో చామంతిని విరివిగా వినియోగిస్తున్నారు. హెచ్‌ఐవీ-1 నియంత్రణ కోసం తయారు చేసే డ్రగ్స్‌లో చామంతిని వినియోగిస్తారు.

  
 

2 comments:

  1. "
    చామంతి ఏమిటే ఈ వింత
    సుమలత గారి బ్లాగులో నీ పులకింత
    "

    సుమలత గారు, బాగా రాసారు. ఇళ్లలో ఎక్కువగా పెరిగే ఈ చామంతికి ఇన్ని సుగునాలున్నాయని అస్సలు తెలేడు. మంచి విషయాలు పంచుకున్నందుకు మంగిడీలు(ధన్యవాదాలు).

    ReplyDelete
  2. థాంక్స్ అండి స్పందించినందుకు చామంతి ఏమిటో ఇ వింత లైన్ బలే నచ్చే సింది.

    ReplyDelete