ఓ గుడ్డిబిక్షువు రద్దీగా వున్న రోడ్డు పక్కన కూర్చుని ఆ దారిన వచ్చే పోయే వారిని యాచిస్తున్నాడు
అతడి పక్కనే తలక్రిందులుగా చేసిన టోపిలో దయగలవారు రుపాయీ ,అర్ధ రుపాయీ ,వేస్తూ వెళ్ళుతున్నారు బిక్షువు పక్కనే చిన్న పలక పై నేను గుడ్డి వాణ్ణి దయచేసి నాకు సహాయం చెయ్యండి అని వ్రాసి వుంది అటుగా వెళ్ళుతున్న ఓ వ్యక్తి బిక్షువు టోపిలో ఓ రుపాయీ నాణే౦ వేసి ఆ పక్కనే వున్న పలక తీసుకోని దాని మిద రెండు మూడు వాక్యాలుకొత్తగా వ్రాసి దాన్ని అందరు చూసేలా అమర్చి వెళ్లి పోయాడు .
తానూ చేసిన పనికి పలితం ఎలా వుందో తెలుసుకోవాలని సాయంత్రం ఆ వ్యక్తి బిక్షువు దగర్రికి వెళ్ళాడు. ఆశ్చర్యంఆ టోపీ నిండా నాణాలే ఆ బిక్షువు ఆ వ్యక్తి రాకను గమనించి అయ్యా మీరు నాకు మధ్యానం సహాయం చేసి వెళ్ళినవ్యక్తివే కదా ! మీకు నాకు నా ధన్యవాదాలు నా పలక మీద ఏదో రాసినట్టు నేను గ్రహించాను మీరు వెళ్ళాక నాకు చాల మంది సాయం చేసారు ..మీరు పలక మీద ఏ రాసారో తెలుసుకోవచ్చా అన్ని ప్రాదేయపడ్డాడు.
అప్పుడు ఆ వ్యక్తి నవ్వి నువ్వేం వ్రాసావో నేను అదే రాసాను . కాకపోతే నేను కొంచెం మార్చి రాసాను అంతే! అన్నాడు నేను గుడ్డి వాణ్ణి దయ చేసి సాయం చెయ్యండి అని నువ్వు రాసావు నేను దాన్ని మార్చి మహాత్మా ! ఈ రోజు ఎంతో అందమైనది .ఆ అందాన్ని ఆస్వాదించగల అదృష్టవంతులు మీరు నాకు అదృష్టం లేదు .నాకు దయచేసి సాయం చెయ్యండి అని రాసానంతే! అన్నాడు .నిజానికి గుడ్డివాడు వాక్యాలకు ఆ వ్యక్తి రాసిన వాక్యాలకు తేడా ఎమి లేదు రెండు ఆ బిక్షువు గుడ్డివాడినని చెబుతున్నాయి. కాని ఆ వ్యక్తి వాక్యాలే ప్రబావితంగా వున్నాయి.
దిన్ని బట్టి మనం మూడు విషయాలు గ్రహించవచ్చు.......................................
వున్నదాంతో తృప్తి పడండి మీకు వున్నది కూడ ఇతరులకు లేకపోవచ్చు ఇది మొదటిది ఇక రెండొవది అర్హత కల్గిన వ్యక్తులకు ,అవసరంలో వున్న వారికి విలైనంతవరకు సాయం చెయ్యండి మూడోది ఏమిటంటే మీలో సృజనాత్మకత వుంటే బిన్నంగా ఆలోచించే ప్రయత్నం చేయగల్గితే ప్రతి పనిని అనుకున్న దాని కంటే గొప్పగా పూర్తి చేయవచ్చు .
మనిషి కి బావవ్యక్తికరణ గొప్ప ఆస్తి ఏం చెప్పాలనుకునే దానికన్నాఎలా చెప్పాలో తెలుసుకోవడంలోనే మనిషి విజ్ఞత దాగి వుంటుంది ప్రతి విషయాన్నీ ముక్కు సూటిగా చెప్పడంలో ప్రమాదం పొంచి వుండవచ్చు.....
ఇతరులను ఆకట్టుకునేలా వాక్పటిమను అలవరుచుకోవాలి . అప్పుడే వాక్కు ఎవరికైన బూషణమవుతుంది.
మీరు దిన్ని చదివేసి ఇకనైనా జాగ్రత్తగా వుంటారని ఏదో బాబు నాకు తెలిసింది మీ చెవున ఎసాను టాటా మరి తర్వాత టపా లో కలుద్దాం ...........
అశాంతి నిలయం
10 hours ago
చాలా బాగుందండి.
ReplyDeleteతేజస్వి