Thursday 10 February 2011

జీడిపప్పు హల్వా తయారీ

ముందు గా మా అమ్మమ్మ వాళ్ల వూరు వేటపాలెం అక్కడ బాగా దొరికేవి జిడి కాయలు ,జిడి పప్ప్పు ముంత మామిడి కాయలు ,వేసవి లో వెళ్ళే వాళ్ళం తాటి ముంజలు ,అయేతే చెట్టు ఎక్కి కోసుకొని తినడమే బాగా సలిసు గా దొరికే జిడి పప్పు తో హల్వా ఎలా చెయ్యా లో చెబ్తాను
.
జీడిపప్పు                     =  2 కప్పులు 
నెయ్యి                          =  2 చెంచాలు 
బాదాం పలుకులు         =  2 కప్పులు 
పంచదార                     =  2 కప్పులు 
కుంకుమ పువ్వు          =   కొద్దిగా
పాలు                           =  1లీటరు
ఎలాచి                          =  కొంచెం  



ముందుగా జీడిపప్పు ని   ఒక గంట సేపు నానా పెట్టాలి  తర్వాత  మెత్తగా రుబ్బి పెట్టు కోవాలి
.  
ఒక లీటరు పాలు పొయ్యి మిద పెట్టి  బాగా మరిగేటప్పుడు మనం యిప్పటికి సిద్దంగా వుంచుకున్న జీడిపప్పుముద్దను వేసి బాగా కలుపుకోవాలి
 .
పాలలో వుడికే జీడిపప్పు కు పంచదారను కలుపుకోవాలి.యీ మిశ్రమాన్ని బాగా పాకం కొద్దిగా గట్టి పడేదాకా వుడికించాలి  అలా ముద్దగా అయీన తర్వాత మంచి కలర్ యాలకుల పొడి వేసి దించుకుంటే  దానిఫై అలంకరణ కోసం కుంకుమ పువ్వు మరియు బాదాం రేకుల్ని చల్లాలి .అప్పుడు జీడిపప్పు హల్వా రెడీ  .

2 comments:

  1. ఆహ బాగుందండీ మీ హల్వా జిడ్డిపప్పు అంత చిప్ గా దొరుకుతాయి మరి మాకును

    ReplyDelete
  2. ఈ జీడిపప్పు హల్వా ఐడియా మీకు ఎలా వచ్చింది చెప్మా! జీడిపప్పు కూరల్లో వేస్తుంటేనే జనాలు వింతగా చూస్తున్నారు...హల్వా చేస్తే పారిపోతారేమో! పైగా...పైన కామెంటులో డైలాగ్ కొట్టినా ఆశ్చర్యపడక్కర్లేదు.అయినా కూడా నాకు ఈ హల్వా నచ్చింది! నేను జీడిపప్పు ఫ్యాన్ కదా! ;)

    ReplyDelete